Hollywood: ప్రముఖ హాలీవుడ్‌లో నిర్మాత కుమర్తె డైలాన్ మేయర్ పెళ్లి చేసుకుంది. అంటే.. అబ్బాయిని కాదండోయ్ అమ్మాయిని పెళ్లి చేసుకుంది. ట్విలైట్ సినిమాను నిర్మించిన డైలాన్ మేయర్.. ఆ సినిమాలో హీరోయిన్‌గా నటించిన క్రిస్టిన్ స్టివార్డ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి మధ్య ప్రేమ ట్విలైట్ సినిమాను సెట్లోనే చిగురించడం కొసమెరుపు. చానాళ్ల డేటింగ్ తర్వాత రీసెంట్‌గా పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు.
డైలాన్ మేయర్ కొన్ని షార్ట్ ఫిలింలో నటించి నిర్మించారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఎక్సోఎక్సో సినిమా, పలు సినిమాలను నిర్మించారు. హాలీవుడ్‌లో పాపులర్ ట్విలైట్ చిత్రం సమయంలో మేయర్, కిస్టిన్ మధ్య ప్రేమ చిగురించింది.
ఇద్దరూ 2019 నుంచి డేటింగ్‌లో ఉన్నారు. ఎంగేజ్‌మెంట్ 2021లో చేసుకున్నారు. అప్పటి నుంచి వీరు రిలేషన్‌లో ఉన్నారని అందరికీ తెలిసింది. ఈక్రమంలో ఈస్టర్ పండుగ రోజు ఏప్రిల్ 20న ఇద్దరూ దంపతులుగా మారారు. అయితే.. హీరోయిన్ క్రిస్టిన్ స్టివార్డ్‌కు గతంలో నటుడు రాబర్ట్ పాటిన్సన్‌ను వివాహం జరిగింది. కొన్నాళ్ల తర్వాత వారు విడిపోయారు. ఆ తర్వాత నుంచి డైలాన్‌తో ప్రేమ కొనసాగిస్తోంది.
మీడియా కథనాల మేరకు.. ట్విలైట్ సినిమాకు రైటర్‌గా పనిచేసిన డైలాన్‌తో క్రిస్టెన్‌కు పరిచయం ఏర్పడిందని, అది కాస్త డేటింగ్ వరకు వెళ్లిందని పేర్కొన్నారు. దీంతో వీరిద్దరి మధ్య క్లోజ్ రిలేషన్ ఏర్పడిందని అదికాస్త ప్రేమగా మారిందన్నారు. వీరి ప్రేమ బంధాన్ని పెద్దలకు చెప్పగా వారూ అంగీకరించారని అన్నారు. ఇక పెళ్లికి కొద్ది రోజుల ముందే ఇద్దరూ పెళ్లికోసం రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి అనుమతి పొందారు. అలా పెళ్లి పనులు పూర్తి చేసుకొన్నారు. ఇద్దరి పెళ్లికి హాలీవుడ్ నటులు ఆష్లే బెన్సన్, బ్రాండన్ డేవిస్ దంపతులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు వైరల్‌గా మారాయి.
హీరోయిన్ క్రిస్టెన్ స్టివార్ట్, నిర్మాత డైలాన్ మేయర్ ఇద్దరూ అమ్మాయిలు అయినప్పటికీ వారి పెళ్లికి పెద్దలు అంగీకరించారు. నిరాడంబరంగా జరిగిన పెళ్లిలో అత్యంత తక్కువ మంది అతిథుల మధ్య పెళ్లి చేసుకున్నారు.