గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అరుదైన గౌరవాన్ని పొందారు. తన స్టాచ్యూని తానే స్వయంగా ఆవిష్కరించారు. ఈ అద్భుత దృశ్యం చూసి ఫ్యాన్స్ పులకించిపోయారు. లండన్ లో జరిగిన ఈ వేడుకకు మెగా ప్యామిలీ అంతా హాజరయ్యారు.
మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లండన్‌లో సందడి చేస్తున్నారు. ఈ రోజు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మైనపు విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమం కోసం నాలుగు రోజుల ముందుగానే రామ్ చరణ్ తో పాటు మెగా ఫ్యామిలీ అంతా నాలుగు రోజుల ముందే లండన్‌కి వెళ్లారు. ఈ సందర్భంగా లండన్ లో అభిమానులు మెగా ఫ్యామిలీకి ఘన స్వాగతం పలికారు.
ఇక తాజాగా రామ్ చరణ్ మైనపు విగ్రహం ఆవిష్కరణ అద్భుతంగా జరిగింది. తన పెట్ డాగ్ ను పట్టుకుని ఓ సోఫాలో రామ్ చరణ్ కూర్చున్న ఫోజులో మైనపు విగ్రహాన్ని తయారు చేశారు మేడా టుస్సాడ్స్ టీమ్. ఈ సందర్భంగా ఈ మైనపు విగ్రహావిష్కరణ ను స్వయంగా తానే చేశారు రామ్ చరణ్. ఈ ఆవెంట్ సందర్భంగా లండన్‌లో మెగా అభిమానులు సందడి చేశారు. చిరు, చెర్రీలతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేశారు.
ఇక ఇందకు సబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.గ్లోబల్ స్టార్ కావడంతో రామ్ చరణ్ కు కూడా ఇండియాతో పాటు విదేశాలలోనూ క్రేజ్ అదే స్థాయిలో ఉంది. ఇక ఈ రేంజ్ లో రెస్పాన్స్ రావడంతో అటు మెగా ఫ్యాన్స్ కూడా మురిసిపోతున్నారు. లండన్‌లోని మేడం టుస్సాడ్స్ లో చరణ్ మైనపు విగ్రహం లాంచ్ కావడం అరుదైన గౌరవం అని చెప్పాలి. ఈ విగ్రహాన్ని త్వరలోనే సింగపూర్ టుస్సాడ్స్ మ్యూజియంకు తరలిస్తారు. శాశ్వతంగా అక్కడే ప్రదర్శనకు ఉంచుతారు.
గతంలో టాలీవుడ్ నుంచి చాలామంది సెలబ్రిటీల విగ్రహాలు మేడం టుస్సాడ్స్ నుంచి చేశారు. మహేశ్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, ప్రభాస్ మైనపు బొమ్మలు లాంచ్ కాగా, బాలీవుడ్ నుంచి అమితాబ్, షారుఖ్ లాంటి స్టార్స్ కు ఈ గౌరవం దక్కింది. ఆ జాబితాలో ఇప్పుడు రామ్ చరణ్ కూడా చేశారు.