హైదరాబాద్ లో స్టార్ట్ అయిన 72వ మిస్ వరల్డ్ పోటీలు, ఇండియా నుంచి పోటీలో ఉన్నది ఎవరంటే?

Published : May 11, 2025, 06:56 AM IST
హైదరాబాద్ లో స్టార్ట్ అయిన 72వ మిస్ వరల్డ్ పోటీలు, ఇండియా నుంచి పోటీలో ఉన్నది ఎవరంటే?

సారాంశం

ఈసారి మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ వేదిక అయ్యింది. దేశ విదేశాల నుంచి వచ్చిన సుందరీమణుల నుంచి ప్రపంచ సుందరి ఎంపికను హైదరాబాద్ నుంచి చేయనున్నారు. అందుకోసం ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. ఈక్రమంలో హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో 72వ మిస్ వరల్డ్ పోటీల్ అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. 

ప్రపంచ సుందరి ఏంపికకు ఈసారి హైదరాబాద్‌ వేదిక అయ్యింది.  72వ మిస్‌ వరల్డ్ పోటీ ఈ శనివారం (మే 10) సాయంత్రం 6 గంటలకు అట్టహాసంగా ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ పాటతో ప్రపంచ సుందరి పోటీలు ప్రారంభమవ్వడం విశేషం. హైదరాబాద్ మహానగరం తొలిసారి మిస్‌ వరల్డ్ పోటీలకు అతిథ్యమిస్తోంది. ఈ వేడకలకు  గచ్చిబౌలి స్టేడియం వేదికగా మారింది.  కన్నుల పండుగ ప్రపంచ సుందరి పోటీల ప్రారంభ కార్యక్రమం జరిగింది. దాదాపుగా 110 దేశాల నుంచి అందమైన సుందరీమణులు పోటీపడటానికి హైదరాబాద్ చేరుకున్నారు. 

ఈ వేడుకల కోసం హైదరాబాద్ కూడా అందంగా ముస్తాబు అయ్యింది. తెలంగాణ సంస్కృతి ప్రపంపంచ దేశాలకు తెలిసేలా ఏర్పాట్లు చేశారు అధికారులు. హైదరాబాద్ గొప్పతనం ప్రతిబింబించేలా కార్యక్రమాలు చేపట్టారు. వివిధ సంస్కృతిక కార్యక్రమాలతో వేడుకల ఓపెనింగ్ కార్యక్రమం జరిగింది. ఇక మిస్ వరల్డ్ వేదికపై ప్రత్యేక ఆకర్షణగా మిస్ వరల్డ్ 2024 క్రిష్టినా పిస్కోవా నిలిచారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఎస్ రామకృష్ణారావు, బీజేపీ జితేందర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ తదితరులు హాజరయ్యారు. 

ఈ  వేడుకలను తెలంగాణ ప్రభుత్వం  ప్రతీష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేసింది.  ఈ వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా రావాల్సి ఉంది. కాని  భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న క్రమంలో ..  మిస్ వరల్డ్ పోటీలకు సీఎం రేవంత్ రెడ్డి దూరం ఉన్నారు. ఇక  మిస్ వరల్డ్ పోటీలు మే 10 నుంచి మే 31 వరకు దాదాపు 22 రోజుల పాటు జరగనున్నాయి. 

ఈ వేడుకల కోసం దాదాపు 120 దేశాల నుంచి సుందరీమణులు హాజరకావల్సి ఉండగా.. ఇప్పటి వరకూ 110 మంది మాత్రమే హైదరాబాద్ చేరుకున్నారు. మన దేశం నుంచి ఈ పోటీలలో నందిని గుప్తా పాల్గొంటున్నారు. అయితే మిస్ వరల్డ్ పోటీలు వరుసగా రెండో సారి ఇండియాలో జరుగుతుండటం విశేషం. గత ఏడాది మిస్ వరల్డ్ పోటీలకు ముంబయ్ వేదిక అయ్యింది. 71 మిస్ట్ వరల్డ్ పోటీలలో క్రిష్టినా పిస్కోవా విజేతగా నిలిచారు.   

PREV
Read more Articles on
click me!

Recommended Stories

The Paradise Teaser: దసరా మ్యాజిక్ రిపీట్ అవుతుందా? నాని ప్యారడైజ్ టీజర్ ఎలా ఉందంటే?
OG-Varun Tej: ఓజీతో కొరియన్‌ కనకరాజు పోలికపై వరుణ్‌ తేజ్‌ క్లారిటీ.. అసలు విషయం బయటపెట్టిన మెగా ప్రిన్స్