చిత్ర పరిశ్రమలో విషాదం.. జాతీయ అవార్డు మేకప్‌ ఆర్టిస్ట్ విక్రమ్‌ గైక్వాడ్‌ కన్నుమూత

Published : May 10, 2025, 05:17 PM IST
చిత్ర పరిశ్రమలో విషాదం.. జాతీయ అవార్డు మేకప్‌ ఆర్టిస్ట్ విక్రమ్‌ గైక్వాడ్‌ కన్నుమూత

సారాంశం

చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బాలీవుడ్‌ మేకప్‌ ఆర్టిస్ట్ విక్రమ్‌ గైక్వాడ్‌ కన్నుమూశారు. 

చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బాలీవుడ్‌ మేకప్‌ ఆర్టిస్ట్ విక్రమ్‌ గైక్వాడ్‌(51) కన్నుమూశారు. జాతీయ అవార్డు గ్రహీత అయిన విక్రమ్‌ గౌక్వాడ్‌ బాలీవుడ్‌లో మేకప్‌ ఆర్టిస్ట్ గా చాలా పాపులర్‌. చాలా మంది స్టార్స్ కి ఆయన పనిచేశారు. ప్రధానంగా బాలీవుడ్‌ తోపాటు మరాఠీ అలాగే, సౌత్‌ మూవీస్‌కి కూడా వర్క్‌ చేశారు. 

విక్రమ్‌ గైక్వాడ్‌ పని చేసిన చిత్రాల్లో `పానిపట్‌`, `బెల్‌బాటమ్‌`, `ఉరి`,`బ్లాక్‌ మెయిల్‌`, `దంగల్‌`, `పీకే`, `సూపర్‌30`, `కేదార్‌ నాథ్‌` వంటి చిత్రాలకు ఆయన పనిచేశారు. అవి మంచి పేరుని తీసుకు వచ్చాయి. `డర్టీ పిక్చర్‌` మూవీకి నేషనల్‌ అవార్డు వరించింద. పలు సినిమాలకు ఐఐఎఫ్‌ఏ, ఎఫ్‌ఓఐ పురస్కారాలు వరించాయి. అంతేకాదు పలు చిత్రాల్లో నటుడిగానూ మెప్పించారు విక్రమ్‌ గైక్వాడ్‌. 

విక్రమ్‌ గైక్వాడ్‌ మృతికి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌ నాథ్‌ షిండే సంతాపం తెలిపారు. ఆయన మరణం తీరని లోటు అన్నారు. మరికొందరు సినీ ప్రముఖులు గైక్వాడ్‌ మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని వెల్లడించారు. అయితే గైక్వాడ్‌ మృతికి కారణం ఏంటనేది తెలియరాలేదు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

400 కోట్లకు పైగా బాక్సాఫీస్ వసూళ్లు సాధించిన టాప్ 5 సినిమాలు ఇవే
Rashmi Gautam Marriage: యాంకర్‌ రష్మి పెళ్లి వార్త.. చేసుకునేది అతన్నే