హీరో విజయ్ కి కరోనా పరీక్షలు

By Surya PrakashFirst Published Apr 1, 2020, 1:53 PM IST
Highlights

లాక్ డౌన్ సమయంలో విదేశాల నుంచి వచ్చిన వారికీ ఆరోగ్య సిబ్బంది పరీక్షలు నిర్వహించి కరోనా బారిన పడ్డవారిని గుర్తించి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇందుకు సెలబ్రెటీలు, సినిమావాళ్లు అతీతులు ఏమీ కాదు. 

కరోనా దేశవ్యాప్తంగా వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర 21 రోజులు లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. కేంద్ర ఆదేశాల ప్రకారం ఈ లాక్ డౌన్ ఏప్రిల్ 14 వ తేదికి పూర్తకానుంది.  ఈ లాక్ డౌన్ సమయంలో విదేశాల నుంచి వచ్చిన వారికీ ఆరోగ్య సిబ్బంది పరీక్షలు నిర్వహించి కరోనా బారిన పడ్డవారిని గుర్తించి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇందుకు సెలబ్రెటీలు, సినిమావాళ్లు అతీతులు ఏమీ కాదు. ఇందులో భాగంగానే తమిళ్ స్టార్ హీరో విజయ్ ఇంటికి...ఆరోగ్య సిబ్బంది వచ్చి తనిఖీలు నిర్వహించడం తమిళ ఇండస్ట్రీలో కలకలం రేపింది .

అందుకు కారణం బయిటకు వచ్చింది. షూటింగ్ పని మీద విదేశాలకు వెళ్లిన విజయ్ దళపతి ఇటీవల తన స్వగృహానికి చేరుకున్నాడు.  విదేశాల నుంచి వచ్చిన వారికి మెడికల్ టెస్టులు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ చెన్నైలోని ఆయన నివాసాన్ని వైద్య అధికారులు తనిఖీ చేయటం జరిగిందని వార్తలు వస్తున్నాయి. విజయ్ తో పాటు కుటుంబ సభ్యులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. వైద్య బృందం వారికీ చేసిన పరీక్షల్లో ఎవరికీ కరోనా లేదని నిర్ధారణ కావడంతో అభిమానులు కుదుట పడ్డారు. ఈ విషయం తమిళనాట వైరల్ గా మారింది.

ఇక విజయ్ తాజా చిత్రం విషయానికి వస్తే...లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో విజయ్‌ నటిస్తున్న చిత్రం ‘మాస్టర్‌’. విజయ్‌ సేతుపతి విలన్‌గా నటిస్తున్నారు. గతంలో రజనీకాంత్‌ నటించిన ‘పేట’లో ఆయన విలన్ గా నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు విజయ్‌తో తలపడుతున్నారు. ఇది హిట్  కొరియన్‌ చిత్రం ‘సైలెన్స్‌డ్‌’ కాపీ అంటూ సోషల్ మీడియాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

 ఆ కొరియన్‌ చిత్రంలో మూగ, చెవుడు వంటి ప్రత్యేక ప్రతిభావంతులను హీరో కాపాడుతున్నట్లు షూట్ చేసారు. అలాగే వారిపై జరిగే లైంగిక దాడులను అడ్డుకునే వ్యక్తిగా హీరోగా కనిపిస్తారు. అలాంటి కథతోనే ‘మాస్టర్‌’ను కూడా తెరకెక్కిస్తున్నారని నెటిజన్లు చెబుతున్నారు. దీనికి ఇటీవల చెన్నైలోని ప్రత్యేక ప్రతిభావంతుల చిన్నారుల వసతి గృహంలో చిత్రీకరణ జరపడమే కారణం. అందుకే ఈ ప్రచారం సాగుతోంది. 
 

click me!