టాలీవుడ్ డ్రగ్స్ కేసు: దూకుడు పెంచిన ఈడీ.. లబ్ధిదారుల ఆస్తుల జప్తు

By Siva KodatiFirst Published Aug 28, 2021, 7:17 PM IST
Highlights

టాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు ప్రకంపనలు సృష్టిస్తుంది. దూకుడు పెంచిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌(ఈడీ), కొందరు టాలీవుడ్ ప్రముఖులకు విచారణకు హాజరు కావాలంటూ సమన్లు జారీ చేశారు గతంలో ఈడీ అధికారులు డ్రగ్ పెడ్లర్స్ కెల్విన్, కమింగా, విక్టర్ లను అరెస్ట్ చేయడం జరిగింది. 

డ్రగ్స్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. లబ్ధిదారుల ఆస్తుల జప్తు దిశగా చర్యలు తీసుకుంటోంది. మనీలాండరింగ్ సెక్షన్ 3, 4 తో పాటు అబ్కారీ శాఖ కేసుల ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసింది. విదేశీ అక్రమాస్తుల లావాదేవీలు గుర్తిస్తే .. ఫెమా కేసులు నమోదు చేసే అవకాశం వుంది. ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 22 వరకు ఈ కేసుకు సంబంధించి సినీ ప్రముఖులను ప్రశ్నించనుంది ఈడీ. విచారణలో తేలే అంశాల ఆధారంగా సోదాలు చేసే అవకాశం వుంది. 

టాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు ప్రకంపనలు సృష్టిస్తుంది. దూకుడు పెంచిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌(ఈడీ), కొందరు టాలీవుడ్ ప్రముఖులకు విచారణకు హాజరు కావాలంటూ సమన్లు జారీ చేశారు గతంలో ఈడీ అధికారులు డ్రగ్ పెడ్లర్స్ కెల్విన్, కమింగా, విక్టర్ లను అరెస్ట్ చేయడం జరిగింది. వీరి నుండి కీలక సమాచారం సేకరించడంతో పాటు స్టేట్మెంట్ నమోదు చేశారు. 

ALso Read:టాలీవుడ్ డ్రగ్స్ కేసు: విదేశాలకు డబ్బు తరలింపు, డ్రగ్స్ కొనుగోళ్లపై అధికారుల దృష్టి

పూరి జగన్నాధ్, రవితేజ, నవదీప్, తరుణ్, ఛార్మి, రానా, రకుల్, నందు,మొమైత్ ఖాన్, తనీష్ లతో పాటు రవితేజ డ్రైవర్, ఎఫ్ క్లబ్ ఓవర్ మొత్తం 12మందిని, ఈనెల 31నుండి సెప్టెంబర్ 22వరకు వరుసగా విచారించనున్నారు.  విదేశాలకు నిధుల తరలింపుపై వీరిని ఈడీ విచారించనుంది. వీరి విచారణ పూర్తి అయిన అనంతరం మరికొంత మందికి నోటీసులు జారీ చేసే అవకాశం కలదు. 

click me!