ఐపీఎల్‌ చూడకపోతే కొంపలేం మునగవు.. దర్శకుడు అనిల్‌ రావిపూడిపై షాకింగ్‌ ట్రోల్స్

Published : May 02, 2024, 03:51 PM IST
ఐపీఎల్‌ చూడకపోతే కొంపలేం మునగవు.. దర్శకుడు అనిల్‌ రావిపూడిపై షాకింగ్‌ ట్రోల్స్

సారాంశం

దర్శకుడు అనిల్‌ రావిపూడి ఇప్పుడు ట్రోలర్స్ బారిన పడ్డారు. వారికి కామెంట్లకి బలవుతున్నాడు. సోషల్‌ మీడియా వేదికగా ఆయన్ని ఆడుకుంటున్నారు.   

దర్శకుడు అనిల్‌ రావిపూడి ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రాలకు పెట్టింది పేరు. `పటాస్‌` నుంచి `ఎఫ్‌ 3` వరకు తనదైన కామెడీ చిత్రాలతో అలరించారు. వినోదంతోపాటు తన చిత్రాల్లో యాక్షన్‌ కూడా ఉంటుంది. `పటాస్‌`, `రాజా ది గ్రేట్‌`, `సుప్రీం`, `సరిలేరు నీకెవ్వరు` చిత్రాల్లో చూపించారు. అలాగే తన రూట్‌ మార్చి `భగవంత్ కేసరి` వంటి సెంటిమెంటల్‌ యాక్షన్‌ మూవీ కూడా చేశాడు. కూతురు సెంటిమెంట్‌తో ఈ మూవీని తెరకెక్కించాడు హిట్‌ కొట్టాడు. 

ఇప్పుడు వెంకటేష్‌ హీరోగా సినిమా చేయబోతున్నారు. `ఎఫ్‌2, `ఎఫ్‌3` తర్వాత వీరి కాంబినేషన్‌లో ఈ మూవీ రాబోతుంది. ఇదిలా ఉంటే అనిల్‌ రావిపూడి తాజాగా `కృష్ణమ్మ` చిత్ర ప్రీ రిలీజ్‌‌ ఈవెంట్‌లో పాల్గొన్నారు. కొరటాల శివ నిర్మాణంలో వస్తోన్న చిత్రమిది. సత్యదేవ్‌ హీరోగా నటించాడు. వీవీ గోపాల కృష్ణ దర్శకుడు. ఈ ఈవెంట్‌కి రాజమౌళి గెస్ట్ గా వచ్చాడు. ఇందులో అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ టీమ్‌కి బెస్ట్ విషెస్‌ తెలిపారు. కొరటాల శివ సమర్పణలో వస్తున్న ఈ మూవీ కచ్చితంగా విజయం సాధించాలన్నారు. 

మరోవైపు నిర్మాతతో తనకున్న అనుబంధాన్ని, సినిమా రిలేషన్‌ని తెలిపారు. అలాగే మైత్రీ నిర్మాత రవిశంకర్‌ని రివ్యూని ప్రశంసిస్తూ సినిమా అలానే పెద్ద హిట్‌ కావాలన్నారు. అంతేకాదు ఈ సందర్భంగా `దేవర` రిలీజ్‌ డేట్‌ని చెప్పాలని కొరటాల శివని, అలాగే మహేష్‌ బాబు సినిమా ఎప్పుడు ప్రారంభిస్తారో డేట్‌ని చెప్పాలని రాజమౌళిని డిమాండ్‌ చేశాడు అనిల్‌ రావిపూడి. కథ, నేపథ్యం తెలుసుకోవాలని ఈగర్‌గా ఉన్నట్టు తెలిపారు. 

ఈ సందర్భంగా అనిల్‌ రావిపూడి ఓ ఇంట్రెస్టింగ్‌ కామెంట్‌ చేశారు. ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ల సందర్భంగా సినిమాలకు ఆడియెన్స్ రావడం లేదు. బాగున్నా సినిమాలకు కూడా కలెక్షన్లు ఉండటం లేదు. దారుణమైన పరిస్థితి ఉన్న నేపథ్యంలో అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ, ఐపీఎల్‌ చూడకపోతే కొంపలేమి మునిగిపోవు, వచ్చి సినిమాలు చూడండి, అవి రెండు మూడు రోజులు అటు ఇటు అయినా ఏం కాదు, ఫోన్‌లో స్కోర్‌ చూసుకోవచ్చు అని తెలిపారు. వచ్చి సినిమాలు చూడాలని ఆయన తెలిపారు. 

ప్రస్తుతం అనిల్‌ రావిపూడి ఈ కామెంట్స్ వైరల్‌ అవుతుంది. నెట్టింట హాట్‌ టాపిక్‌ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు, ట్రోల్స్ రియాక్ట్ అవుతూ రచ్చ చేస్తున్నారు. ఆయన్ని టార్గెట్‌ చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. ఎవరి ఇష్టం వారిది అన్నా ఇలాంటి స్టేట్‌మెంట్లు ఇవ్వొద్దని, క్రికెట్‌, సినిమా రెండింటిని చూస్తారు మనవాళ్లు అని, సినిమాలు మార్నింగ్‌ అయినా చూడొచ్చు, లేట్‌గా అయినా చూడొచ్చు, నష్టం ఏం లేదు, కానీ క్రికెట్‌ని లైవ్‌లో చూస్తే వచ్చే థ్రిల్‌ స్కోర్‌ చెక్ చేస్తే రాదని చెబుతున్నారు. 

అవును సినిమా చూడకపోతే అందరు సచ్చిపోతారు కదా అన్నా, ఎవడికి ఇష్టం వచ్చింది వాడు చూస్తాడు. ఏదో గొప్ప కళాకండాలు తీసినట్టు, వాటిని చూడనట్టు ఫీల్‌ అవుతున్నాడు మన అన్నా అంటూ సెటైర్లు పేలుస్తున్నారు. సినిమా చూడకపోతే ఏం మునిగిపోదు అని, ఓటీటీలో చూడొచ్చు అంటున్నారు. మరోవైపు నిజమే సినిమాలు చూడకపోతే కొందరి కొంపలు మునిగిపోతాయి, ఐపీఎల్‌ చూడకపోతే ఎవరి కొంపలకు ఏం కాదు అంటూ అనిల్‌ రావిపూడికి మద్దతు పలుకుతున్న వారు కూడా ఉండటం విశేషం. మొత్తంగా అనిల్‌ రావిపూడి స్టేట్‌మెంట్‌ సోషల్‌ మీడియాలో తెగ రచ్చ అవుతుండటం గమనార్హం. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి
చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?