కరోనాతో కలిసొస్తోంది,సినిమాలే సినిమాలు

By Surya PrakashFirst Published Mar 17, 2020, 12:24 PM IST
Highlights

కరోనా దెబ్బకు అనేక రాష్ట్రాలతో పాటు ఏపీ, తెలంగాణల్లో కూడా థియేటర్లు మూతబడ్డాయి. ఈ నెల 31 వరకు ఈ పరిస్ఠితి కొనసాగనుంది. దీంతో పూర్తై రిలీజుకు రెడీ అయిన అనేక సినిమాల వాయిదాపడ్డాయి. షూటింగ్స్ మొత్తం ఎక్కడెక్కడే నిలిచిపోయాయి. 


సృష్టిలో ఒక్కోసారి కొందరికి నష్టం అయ్యింది...మరికొందరికి లాభం అవుతూంటుంది. ఇది ప్రకృతి న్యాయం. ఇప్పుడు కరోనా వల్ల అదే జరుగుతోంది. కరోనాతో అనేక వ్యాపారాలు దెబ్బ తింటే... మరి కొంతమంది లాభ పడుతున్నాయి. అందరం శానిటైజర్లు, మాస్క్ లతో కరోనా బారినుంచి బయటపడేందుకు ప్రయత్నిన్నాము. ప్రతిఒక్కరిని శానిటైజర్లు ఉపయోగించాలని, శుభ్రత పాటించాలని సూచిస్తున్నారు ఆరోగ్య అధికారులు.. దాంతో ఇప్పటివరకూ కుప్పలుగా పడిఉన్న మాస్క్ లు, టాయిలెట్ పేపర్లు, శానిటైజర్లకు కరోనా ఎఫెక్ట్‌తో భారీ డిమాండ్ పెరిగిపోయింది. అదే సమయంలో కొనుక్కునే జనాలు లేక చాలా షాప్ లు క్లోజ్ చేస్తున్నారు. 

ఇక కరోనా దెబ్బకు అనేక రాష్ట్రాలతో పాటు ఏపీ, తెలంగాణల్లో కూడా థియేటర్లు మూతబడ్డాయి. ఈ నెల 31 వరకు ఈ పరిస్ఠితి కొనసాగనుంది. దీంతో పూర్తై రిలీజుకు రెడీ అయిన అనేక సినిమాల వాయిదాపడ్డాయి. షూటింగ్స్ మొత్తం ఎక్కడెక్కడే నిలిచిపోయాయి. వేలమంది సినీ కార్మికులకు పని లేదు. ఇక థియేటర్ బిజినెస్ పూర్తిగా మూతబడింది. ఇలా సినీ పరిశ్రమకు భారీ నష్టం, కష్టం వచ్చిపడింది.  ఇలాంటి కష్ట కాలంలో ఒటీటీ ప్లాట్‌ఫామ్ బిజినెస్ మాత్రం దుమ్ము రేపుతోంది. ఊహించని విధంగా ఈ బిజినెస్ ఊపందుకుంది. 

దేశంలోనే కాక మన రెండు రాష్ట్రాల్లోని అనేక ఐటీ, ప్రైవేట్ కంపెనీలు, కళాశాలలు, పాఠశాలలకు శెలవులు ప్రకటించారు. దీంతో సినిమాల మీద ఇంట్రస్ట్ ఉన్న జనం థియేటర్లు మూతబడటం, ఇతర ఎంటర్టైన్మెంట్ లేకపోవడంతో అమెజాన్, నెట్ ఫ్లిక్స్, ఆహా, హాట్ స్టార్, జీ లాంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ మీద పడుతున్నారు. దానికి తోడు ఈ ఓటీటీ మెంబర్ షిప్ సబ్ స్క్రిక్షన్ కూడా తక్కువ చేయడంతో పెద్ద ఎత్తున సభ్యత్వాలు నమోదవుతున్నాయట. ఆ విధంగా కరోనా వైరస్ ఎఫెక్ట్   ఓటీటీ రంగానికి కలిసస్తోంది.

click me!