రైతుల కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది: హరీశ్ రావు

By Siva KodatiFirst Published Oct 2, 2019, 8:30 PM IST
Highlights

టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న పనుల వల్ల రైతులకు ఎంతో మేలు చేకూరి వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు. 

టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న పనుల వల్ల రైతులకు ఎంతో మేలు చేకూరి వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ మండలం నాచారం గ్రామంలో బుధవారం వాగుపై చెక్ డ్యామ్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. చెక్ డ్యామ్ ల నిర్మాణంతో ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరగనున్నాయని., ఈ చెక్ డ్యామ్‌ ద్వారా 400 ఎకరాల సాగు నీరు అందనుందన్నారు.  

ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనలో భాగంగా గతంలోనే ఇచ్చిన మాట ప్రకారం రూ.7.48కోట్ల రూపాయల వ్యయంతో హల్దీ వాగు పై చెక్ డ్యామ్ నిర్మాణం చేపడుతున్నట్లు హరీశ్ వెల్లడించారు.

ఇక్కడి ప్రాంత రైతాంగానికి సాగునీరు అందించడంతో పాటుగా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వచ్చే భక్తులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని హరీశ్ రావు తెలిపారు.

దేవస్థానం ఈశాన్యంలో ఉన్న దరిమిలా రానున్న కాలంలో అతి త్వరలోనే కాళేశ్వరం నీళ్లు- గోదావరి జలాలు ప్రవహంగా ఈ ప్రాంతంలో పారుతాయని మంత్రి వెల్లడించారు. నాచారం గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మాస్టర్ ప్లాన్ రూపొందించి దేవాలయాన్ని అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకుంటామని హరీశ్ హామీ ఇచ్చారు.

అంతకుముందు నాచారం గ్రామంలోని శ్రీ లక్ష్మీ నర్సింహా స్వామి ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, నిర్వాహకులు మంత్రికి పూర్ణ కుంభంతో సంప్రదాయంగా స్వాగతం పలికారు. 

click me!