కంత్రీ కొడుకు: బాబాయిపై 50 లక్షల బీమా, కారుతో గుద్ది.. ప్రమాదంగా చిత్రీకరణ

By Siva KodatiFirst Published Feb 14, 2020, 2:20 PM IST
Highlights

డబ్బు కోసం సొంత బాబాయిని చంపించిన ఓ కొడుకు కథ సూర్యాపేట జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

డబ్బు కోసం సొంత బాబాయిని చంపించిన ఓ కొడుకు కథ సూర్యాపేట జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లా మునగాల మండలం తాడ్వాయికి చెందిన సైదులు ఈ నెల 24న వాహనం ఢీకొని చనిపోయాడు.

Also Read:కుటుంబసభ్యుల కోసం త్యాగం.. తన హత్యకు తానే ప్లాన్

అందరూ దీనిని రోడ్డు ప్రమాదంగానే భావించారు. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేయడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. మృతుడి అన్న కుమారుడు రమేశ్ ఓ ఫైనాన్స్ కంపెనీలో నాలుగు లారీలు కొని అప్పుల పాలయ్యాడు.

అప్పులను ఎలాగైనా తీర్చాలని భావించిన రమేశ్.. ఒంటరిగా ఉంటున్న బాబాయి సైదులుపై రూ.50 లక్షలు బీమా చేయించాడు. బీమా డబ్బు కోసం అతనిని హత్య చేయాలని కుట్ర పన్నాడు.

Also Read:శ్రీదేవి పేరిట రూ.240కోట్ల బీమా పాలసీ..

దీనిలో భాగంగా ఈ నెల 24న కొందరు స్నేహితులతో కలిసి బొలేరో వాహనంలో సైదులును ఢీకొట్టాడు. ప్రమాదంలో అతను అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యాడు. దీంతో అతనిని రమేశ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అప్పుల కారణంగా తానే బాబాయిపై బీమా చేయించి హత్య చేసినట్లు అతను అంగీకరించడం కొసమెరుపు.

click me!