సీఎం జ‌గ‌న్ పై రాళ్ల‌దాడి.. కంటిపై గాయం.. వీడియో

Published : Apr 13, 2024, 09:51 PM IST
సీఎం జ‌గ‌న్  పై రాళ్ల‌దాడి.. కంటిపై గాయం.. వీడియో

సారాంశం

YS Jagan Mohan Reddy : ఎన్నిక‌ల ప్రచారం సంద‌ర్భంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి, వైకాపా అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై రాళ్ల‌దాడి జ‌రిగింది. దీంతో ఆయ‌న కంటిపై గాయం అయింది.   

Stone pelting on YS Jagan Mohan Reddy : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయ‌లు హాట్ హాట్ గా మారుతున్నాయి. విమ‌ర్శ‌ల‌తో మొద‌లైన మాట‌ల యుద్ధం ఇప్పుడు బౌతిక దాడుల చేసుకునేలా ప‌లు ఘ‌ట‌న‌లు చోటుచేసుకోవ‌డంతో ఆందోళ‌న వ్యక్త‌మ‌వుతోంది. ఇలాంటి స‌మ‌యంలో ముఖ్య‌మ‌త్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై రాళ్ల‌దాడి జ‌రిగింది. విజ‌య‌వాడ‌లో బ‌స్సుయాత్ర సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ పై కొందరు ఆగంతకులు రాళ్లు విసరడం కలకలం రేపింది. బ‌స్సు యాత్ర ఘ‌నంగా సాగుతున్న స‌మ‌యంలో పార్టీ శ్రేణులు పూల వ‌ర్షం కురిపించాయి. ఇదే స‌మ‌యంలో కొంద‌రు దుండ‌గులు రాళ్ల‌ను కూడా విసిరారు. 

దీంతో జ‌గ‌న్ పై ప‌డ్డ రాళ్ల‌తో ఆయ‌న ఎడమ కంటికి గాయం అయింది. క‌ను బొమ్మ‌పై రాయి త‌గ‌ల‌డంతో గాటు ప‌డింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ జగన్ కు రాళ్లదాడిని అడ్డుకున్నారు. సీఎం జగన్ ను కవర్ చేస్తూ నిలబడ్డారు. ఆ తర్వాత వాహనం లోపలికి తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్సను అందించాడు. వైద్యులు పరిశీలించిన తర్వాత జగన్ తన బస్సు యాత్రను మళ్లీ ప్రారంభించాడు. 

 

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?