కర్నూలు కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

By Siva KodatiFirst Published Oct 2, 2019, 4:14 PM IST
Highlights

కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అలీ ఖాన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాలల వేసి నివాళులర్పించారు

కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అలీ ఖాన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాలల వేసి నివాళులర్పించారు.

అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో గాంధీ, లాల్‌బహుదూర్‌ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలల వుసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా అలీఖాన్ మాట్లాడుతూ... ఆంగ్లేయుల పాలన నుండి మన దేశానికి విముక్తి చేయడానికి కృషి చేసిన మహానుభావుడు మహాత్మా గాంధీ అని కొనియాడారు.

సత్యం, అహింస సిద్ధాంతాలతో సామాన్య ప్రజల్లో సైతం జాతీయ భావాలు రేకెత్తించి బ్రిటీషువారి గుండెల్లో గుబులు పుట్టించి వారి నియంతృత్వ పాలనకు కళ్లెం వేసిన మహా మేధావన్నారు.

అలాగే దివంగత మాజీ ప్రధాని లాల్‌బహుదూర్ శాస్త్రి సేవలను సైతం కొనియాడారు. జైజవాన్ జైకిసాన్ అన్న నినాదంతో భారతదేశంలో ప్రతి ఒక్కరిని ఉత్తేజ పరచి దేశభక్తి ప్రపూరితులుగా చేసిన మహనీయ మూర్తి ఆజన్మాంతం ప్రజా సేవకే జీవితాన్ని అంకితం చేసిన దేశభక్తుడని అలీఖాన్ తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతల మహిళలకు చీరలు పంపిణీ చేశారు. 

click me!