చిన్నాన్న హత్య జగన్నాటకమే, సునీత మాటల్లో తేడాలు: చంద్రబాబు

By narsimha lodeFirst Published Mar 28, 2019, 11:09 AM IST
Highlights

తన రాజకీయ లాభాల కోసం వివేకా కూతురు, భార్యతో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ తప్పుడు ఫిర్యాదులు చేయిస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు.
 

అమరావతి: తన రాజకీయ లాభాల కోసం వివేకా కూతురు, భార్యతో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ తప్పుడు ఫిర్యాదులు చేయిస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు.

గురువారం నాడు ఆయన పార్టీ నేతలతో టెలి కాన్పరెన్స్ నిర్వహించారు.వివేకా కూతురు వ్యాఖ్యల్లో రోజు రోజుకూ వైరుధ్యాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.నిష్ఫక్షంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉంటుందన్నారు.డేటా చోరీ, చిన్నాన్న హత్య, విశాఖలో హత్యాయత్నంలు అన్నీ కూడ జగన్నాటకాలేనని ఆయన ఆరోపించారు.

ఈసీ బాధిత ఎస్పీలకు అండగా నిలుస్తామని చంద్రబాబునాయుడు ప్రకటించారు.31 కేసులున్న వ్యక్తి ఫిర్యాదు చేస్తే ఆగమేఘాల మీద ఈసీ నిజాయితీపరులైన ఎస్పీలను బదిలీ చేసిందని ఆయన ఆరోపించారు.

నిజాయితీపరులపై చెడ్డవారుగా ముద్ర వేస్తే కెరీర్ ఏమౌతోందని ఆయన ప్రశ్నించారు. ఇంట్లోనూ, బంధువుల మధ్య గౌరవంగా బతికే వారిని అవమానాలకు గురి చేసేలా వైసీపీ వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.

సీబీఐ, ఈడీ, ఐటీ, ఆర్బీఐలను భ్రష్టుపట్టించిన బీజేపీ తాజాగా ఈ జాబితాలో ఈసీని కూడ చేర్చించదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈసీ పరిధిలోని వ్యవహరాలను కూడ ఈసీ పరిధిలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.వీవీప్యాట్లను లెక్కించడానికి ఈసీకి ఉన్న అభ్యంతరాలు ఏమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

వైఎస్ వివేకా హత్య: గంగిరెడ్డి సహా ముగ్గురు అరెస్ట్

చిన్నాన్న హత్య జగన్నాటకమే, సునీత మాటల్లో తేడాలు: చంద్రబాబు

సాక్ష్యాల తారుమారు వెనుక అతనే: వైఎస్ వివేకా కూతురి అనుమానం

వివేకా భార్య, కూతుళ్లను జగన్ భయపెట్టాడు: చంద్రబాబు

గుండెపోటు అని చెప్పిందెవరు: వైఎస్ వివేకా హత్యపై కూతురు సునీతా రెడ్డి

తండ్రి హత్య: పులివెందుల సీఐపై వివేకా కూతురు సంచలన వ్యాఖ్యలు

నమ్మకం లేదు: వైఎస్ వివేకా హత్యపై హైకోర్టులో భార్య పిటిషన్

వివేకా హత్యపై జగన్‌ మీద బాబు ఆరోపణలు: సునీతా రెడ్డి సంచలనం

తండ్రి హత్యపై సీఈసీ వద్దకు వైఎస్ వివేకా కూతురు

వైఎస్ వివేకా హత్య: ప్రధాన అనుచరుల స్కెచ్, కీలక ఆధారాలు సేకరణ

తేలితే ఉరి తీయండి: వైఎస్ వివేకా హత్యపై జగన్ పులివెందుల ప్రత్యర్థి

వైఎస్ వివేకా హత్య కేసు: శేఖర్ రెడ్డి భార్య సంచలన వ్యాఖ్యలు

శేఖర్ రెడ్డే కీలకం: రంగేశ్వర్ రెడ్డిని చంపినట్టే వివేకాను చంపారు

 

click me!