విజయనగరం చేరుకున్న వైఎస్ జగన్, రేపటి నుంచి ప్రజాసంకల్పయాత్ర

By Nagaraju TFirst Published Nov 11, 2018, 8:19 PM IST
Highlights

విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో కత్తిదాడిలో గాయపడి కోలుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రజాసంకల్పయాత్రను పున:ప్రారంభించేందుకు రెడీ అయ్యారు. ఈనెల 12 నుంచి జగన్ పాదయాత్రను ప్రారంభించనున్నారు. అందులో భాగంగా వైఎస్ జగన్ విజయనగరం జిల్లా మక్కువ చేరుకున్నారు. 

విజయనగరం: విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో కత్తిదాడిలో గాయపడి కోలుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రజాసంకల్పయాత్రను పున:ప్రారంభించేందుకు రెడీ అయ్యారు. ఈనెల 12 నుంచి జగన్ పాదయాత్రను ప్రారంభించనున్నారు. అందులో భాగంగా వైఎస్ జగన్ విజయనగరం జిల్లా మక్కువ చేరుకున్నారు. 

కత్తి దాడిలో గాయాలపాలై తొలిసారిగా విశాఖపట్నం చేరుకున్న జగన్ ను చూసేందుకు వైసీపీ కార్యకర్తలు అభిమానులు విశాఖ విమానాశ్రయం దగ్గరకు భారీగా తరలివచ్చారు. జగన్ కు ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. జై జగన్‌ అంటూ వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 

అటు వైఎస్ జగన్ సైతం అభిమానులకు, కార్యకర్తలకు చిరునవ్వుతో అభివాదం చేశారు. విమానాశ్రయం నుంచి నేరుగా కాన్వాయ్ లో విజయనగరం జిల్లా బయలుదేరారు. వైఎస్ జగన్‌ వెంట వైఎస్సార్‌ సీపీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మిథున్‌ రెడ్డిలు ఉన్నారు.

విశాఖపట్నం నుంచి రోడ్డుమార్గం గుండా విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలోని మక్కువ మండలంలో ఏర్పాటు చేసిన  పాదయాత్ర శిబిరం వద్దకు చేరుకున్నారు. గాయాలపాలై 17 రోజుల విరామం తర్వాత జగన్ ప్రజల్లోకి రావడంతో కార్యకర్తలు అభిమానులు ఆయనకు దిష్టి తీశారు. మహిళలు హారతిపట్టారు.  

ఇకపోతే సోమవారం ఉదయం మక్కువ మండలం పాయకపాడు చేరుకోనున్న జగన్ ములపు వలస నుంచి పాదయాత్రను పున:ప్రారంభిస్తారు. అక్కడ నుంచి మక్కువ క్రాస్ రోడ్, ములక్కాయలవలస మీదుగా కాశీపట్నం క్రాస్ రోడ్ వరకు పాదయాత్ర నిర్వహిస్తారు. 

అక్కడ భోజనం విరామం అనంతరం తిరిగి పాపయ్యవలస మీదుగా కొయ్యనపేట వరకు జగన్ పాదయాత్ర కొనసాగనుంది. వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర ఏడాది పూర్తి చేసుకుంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు జగన్ 3,211 కి.మీటర్లు పాదయాత్ర చేశారు.  

వైఎస్ జగన్ పాదయాత్ర పూర్తి చేసుకుని అక్టోబర్ 25న విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ చేరుకున్నారు. విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ నుంచి హైదరాబాద్ చేరుకుని శుక్రవారం హైకోర్టుకు హాజరుకానున్నారు. అయితే గురువారం మధ్యాహ్నం విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లోని వీఐపీ లాంజ్ లో వెయిట్ చేస్తున్న జగన్ ను శ్రీనివాస్ అనే నిందితుడు కత్తితో దాడి చేశాడు. 

ఈ దాడిలో వైఎస్ జగన్ ఎడమ భుజానికి తీవ్ర గాయం అయ్యింది. తొమ్మిది కుట్లు పడ్డాయి. ఈ నేపథ్యంలో వైద్యులు జగన్ ను విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు సుమారు 17 రోజులు విరామం తీసుకున్న జగన్ వైద్యుల సలహాలతో పాదయాత్రకు రెడీ అయ్యారు.   

ఈ వార్తలు కూడా చదవండి

తిరిగి ప్రారంభంకానున్న పాదయాత్ర.. విశాఖ బయలుదేరిన జగన్

జగన్‌పై దాడి: విజయమ్మ అనుమానాలివే

జగన్‌ను ప్రజలే కాపాడుకొన్నారు: కన్నీళ్లు పెట్టుకొన్న విజయమ్మ

తెలంగాణ ఎన్నికలు: పవన్ దూరమే, జగన్ నిర్ణయం ఇదీ...

జగన్‌పై దాడి: శ్రీనివాస్‌కు 120 కాల్స్, ఎవరీ కేకే

జగన్ పై దాడి.. హైకోర్టు సంచలన కామెంట్స్

పవన్ కల్యాణ్, వైఎస్ జగన్ మధ్య సీక్రెట్ భేటీ

జగన్ కు తెలంగాణ సర్కార్ భద్రత, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్, భారీ బందోబస్తు

నా తమ్ముడిని బలిచేశారు.. జగన్ పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాస్ అక్క

జగన్‌పై దాడి: శ్రీనివాస్‌ కత్తి ఎలా తీసుకెళ్లాడంటే?

జగన్ పై దాడి కేసు దర్యాప్తు: తలెత్తే ప్రశ్నలు ఇవీ...

click me!