జగన్‌ను బాబు అందుకే పరామర్శించలేదు: నారా లోకేష్

By narsimha lodeFirst Published Nov 21, 2018, 6:53 PM IST
Highlights

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై దాడి జరిగిన వెంటనే ఫోన్‌లో పరామర్శించాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అనుకొన్నారని   ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు.  

అమరావతి: విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై దాడి జరిగిన వెంటనే ఫోన్‌లో పరామర్శించాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అనుకొన్నారని   ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు.  కానీ, చంద్రబాబుపై వైసీపీ నేతలు తీవ్రమైన విమర్శలు చేయడంతో ఫోన్‌ చేయడాన్ని మానేశారన్నారు.

బుధవారం నాడు అమరావతిలో ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో   తమ పార్టీ కార్యకర్తలను తీవ్రంగా ఇబ్బందులు పెట్టారని లోకేష్ గుర్తు చేశారు. హత్య రాజకీయాలను తాము ఏనాడూ ప్రోత్సహించలేదని చెప్పారు.

పవన్ కళ్యాణ్  తనపై ప్రతి రోజూ కూడ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆయన చెప్పారు.తెలంగాణలో ప్రజా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. టీఆర్ఎస్, వైసీపీ, జనసేనలు ఒక్కటయ్యాయని లోకేష్ ఆరోపించారు.

టీఆర్ఎస్‌కు, బీజేపీకి మధ్య రహస్య ఒప్పందం ఉందని తేలిపోయిందని చెప్పారు. .జగన్, పవన్ కళ్యాణ్, కన్నా లక్ష్మీనారాయణలు కూడ ఆస్తుల  వివరాలను ప్రకటించాలని లోకేష్ డిమాండ్ చేశారు. కేంద్రంపై అవిశ్వాసం పెడితే  ఢిల్లీని వణికిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఎటు పోయారో చెప్పాలని ఆయన కోరారు.

నరేంద్రమోడీని పవన్ కళ్యాణ్ ఎందుకు నిలదీయడం లేదో చెప్పాల్సిందిగా కోరారు.

 

సంబంధిత వార్తలు

జగన్‌పై దాడి: ఫోరెన్సిక్ ల్యాబ్‌కు శ్రీనివాసరావు చేతిరాత

దాడి: జగన్‌‌కు నోటీసులు జారీ చేసిన సిట్

జగన్ చొక్కా ఇస్తేనే.. రహస్యం బయటపడుతుంది: దేవినేని

జగన్‌పై దాడి: పర్మిట్ లేని శ్రీనివాస్ అక్కడికి ఎలా వెళ్లాడు

జగన్‌పై దాడి: సీసీకెమెరాల వైఫల్యంపై హైకోర్టు ఆగ్రహం

జగన్‌పై దాడి: విజయమ్మ అనుమానాలివే

చేయించి మా అమ్మపైకి నెడుతారా: దాడిపై జగన్ భావోద్వేగం

మార్చిలో నా హత్యకు బాబు ప్లాన్, అందుకే శివాజీతో అలా: జగన్

పోలవరంలో అవినీతి, అగ్రిగోల్డ్ ఆస్తులు అన్యాక్రాంతం: బాబుపై జగన్ ఫైర్

జగన్ తో నడవని వైఎస్ ఆత్మ ఏమంటోంది....

జగన్ పై పవన్ ‘మగతనం’ కామెంట్స్

జగన్‌పై దాడి కేసు: చంద్రబాబుకు హైకోర్టు నోటీసులు

 

click me!