బాబుకు రిటైర్మెంట్ సమయం వచ్చేసింది, భవిష్యత్ జనసేనదే:పవన్ కళ్యాణ్

By Nagaraju TFirst Published Nov 21, 2018, 6:25 PM IST
Highlights

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు రిటైర్మెంట్ వయసు దగ్గరకు వచ్చేసిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. చంద్రబాబు జాతీయ నాయకులను కలుస్తున్నారు ఆయనతో కలిసి పనిచేస్తారా అన్న ప్రశ్నకు పవన్ చిరునవ్వుతో సమాధానం చెప్పారు. 

చెన్నై: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు రిటైర్మెంట్ వయసు దగ్గరకు వచ్చేసిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. చంద్రబాబు జాతీయ నాయకులను కలుస్తున్నారు ఆయనతో కలిసి పనిచేస్తారా అన్న ప్రశ్నకు పవన్ చిరునవ్వుతో సమాధానం చెప్పారు. చంద్రబాబుతో పొత్తు ప్రమాదకరం, రాజకీయ ప్రయాణం అంతకంటే ప్రమాదకరమన్నారు.  

ఏపీ సీఎం చంద్రబాబుకు రిటైర్‌మెంట్‌ తీసుకునే సమయం దగ్గర పడిందని తెలిపారు. చంద్రబాబు రిటైర్మెంట్ తీసుకుంటారని అందువల్లే తన కుమారుడిని దొడ్డిదారిన మంత్రిని చేశారని విమర్శించారు. చంద్రబాబు తనయుడు పంచాయతీ ఎన్నికల్లో కూడా గెలవలేడని అలాంటిది ఆయనను పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిని చేశారన్నారు. 

నామినేటెడ్ పదవిచ్చి పంచాయితీరాజ్ శాఖకు అధిపతిని చేశారంటూ వ్యంగ్యంగా విమర్శించారు. టీడీపీ పరిస్థితి ఎలా ఉందో అన్నది ఈ పరిణామాలు చూస్తేనే అర్థమవుతుందన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్‌ జనసేనదేనని పవన్ ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

చెన్నై ప్రెస్ మీట్ లో పవన్ హావభావాలు (ఫొటోలు)

జగన్ తో పొత్తా, నెవర్: పవన్ కల్యాణ్ స్పష్టీకరణ

బాబుతో ప్రయాణం ప్రమాదకరం:రాహుల్ కి పవన్ హెచ్చరిక

తమిళంలో స్పీచ్ అదరగొట్టిన పవన్

 

click me!
Last Updated Nov 21, 2018, 6:25 PM IST
click me!