టీడీపీలోకి వంగవీటి రాధాకృష్ణ.. మండలి బుద్ధప్రసాద్ సేఫ్, లాజిక్ ఇదే..!!!

By sivanagaprasad kodatiFirst Published Jan 22, 2019, 12:56 PM IST
Highlights

వంగవీటి మోహనరంగా తనయుడు, వంగవీటి రాధాకృష్ణ టీడీపీలోకి చేరుతుండటంతో తెలుగుదేశం నేతల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ టికెట్ కోసమే పార్టీని వీడిన రాధకు టీడీపీ అధిష్టానం నుంచి గ్రీన్‌సిగ్నల్ రావడంతో పచ్చకండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారు. 

వంగవీటి మోహనరంగా తనయుడు, వంగవీటి రాధాకృష్ణ టీడీపీలోకి చేరుతుండటంతో తెలుగుదేశం నేతల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ టికెట్ కోసమే పార్టీని వీడిన రాధకు టీడీపీ అధిష్టానం నుంచి గ్రీన్‌సిగ్నల్ రావడంతో పచ్చకండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారు.

అయితే ఆయన రాకవల్ల తన స్ధానానికి ఎసరు వచ్చిందని సిట్టింగ్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు భావిస్తున్నారు. అయితే ఆయన రాకను టీడీపీలోని నేతల్లో అందరికన్నా ఎక్కువగా సంతోషించే నేత అవనిగడ్డ ఎమ్మెల్యే, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్. వంగవీటి రాధాకృష్ణకు, వైసీపీ చీప్ జగన్‌కు చెడింది అవనీగడ్డ విషయంలోనే.

విజయవాడ సెంట్రల్ సీటు ఇస్తాననే హామీ మీదనే రాధ వైఎస్సార్ కాంగ్రెస్ చేరారు. అయితే ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి మల్లాది విష్ణు వైసీపీలో చేరడంతో ఆయనకు సెంట్రల్ టికెట్ ఇస్తున్నట్లు, రాధను అవనిగడ్డ లేదా మచిలీపట్నం లోక్‌సభ స్థానాలో ఏదో ఒకటి తీసుకోవాలని జగన్ ఒత్తిడి తేవడంతో వంగవీటి డైలమాలో పడిపోయారు.

అధినేత ఆదేశాల మేరకు రాధాకృష్ణ అవనిగడ్డ వైపు వెళితే.. అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే బుద్దప్రసాద్‌‌కు పరిస్ధితి కష్టంగా మారేది. ఆ నియోజకవర్గంలో మెజారిటీ ఓటర్లు కాపులే. అందువల్ల రాధాకృష్ణ అవనిగడ్డ నుంచి పోటీ చేస్తే తన ఓటమి ఖాయమని మండలి భావించారు.

చివరికి రాధ బెజవాడ సెంట్రల్ సీటుకి పట్టుబట్టడంతో జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేయడం, వంగవీటి పార్టీకి రాజీనామా చేయడం చకచకా జరిగిపోయాయి. భవిష్యత్ కార్యాచరణ నిమిత్తం రాధా-రంగా మిత్రమండలితో సమావేశమయ్యారు రాధాకృష్ణ. 

ప్రస్తుతమున్న పరిస్ధితుల్లో టీడీపీలో చేరడమే మంచిదని చెప్పడంతో పాటు కొందరు మిత్రుల సూచనలకు అనుగుణంగా తెలుగుదేశంలో చేరేందుకు సిద్ధమయ్యారు వంగవీటి. తద్వారా రాధాకృష్ణ బెజవాడకే పరిమితమవుతారని అవనిగడ్డ వైపు రారనే అభిప్రాయంలో బుద్ధప్రసాద్ ఉన్నారు. అయితే ఈసారి అవినిగడ్డ టికెట్‌ కోసం టీడీపీ ఆశావహుల లిస్ట్ చాలా ఉంది. 

పారిశ్రామిక వేత్త కంఠమనేని రవిశంకర్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్య వారసులు, నూజివీడుకు చెందిన నోవా సంస్థల అధినేత ముత్తంశెట్టి కృష్ణారావు, సింహాద్రి చంద్రశేఖర్ వంటి నేతలు చంద్రబాబు వద్ద పైరవీలు చేస్తున్నారు. వీరిలో ఎవరికైనా టికెట్ ఇస్తారా... లేదంటే మరోసారి మండలి వైపే ముఖ్యమంత్రి మొగ్గుచూపుతారా అన్నది తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. 

వంగవీటి రాధ టీడీపీలో చేరడం వెనుక, సూత్రధారి ఈయనేనా..?

టీడీపిలోకి వంగవీటి రాధా: అవినాష్ జోరుకి బ్రేక్

టీడీపీలోకి వంగవీటి రాధా..సెంట్రల్ పక్కా, బొండా పరిస్థితేంటీ..?

బ్రేకింగ్: 25న టీడీపీలోకి వంగవీటి రాధా..?

వంగవీటి రాధా రాజీనామాపై మల్లాది విష్ణు స్పష్టత

రాధా బాటలోనే మరో కీలక నేత: బుజ్జగిస్తున్న వైసీపీ

వంగవీటి రాధా రాజీనామా ఎఫెక్ట్: కృష్ణాలో వైసీపీకి పలువురు గుడ్ బై

వంగవీటి రాధా రాజీనామా లేఖ పూర్తి పాఠం: జగన్ పై వ్యాఖ్యలు

వంగవీటి రాధా రెండు రోజుల గడువు వెనుక ఆంతర్యం ఇదే..

రెండు రోజుల్లో భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తా: వంగవీటి రాధా

వంగవీటి రాధాకు గేలం వేస్తున్న టీడీపీ

జగన్‌కు షాక్: వైసీపీకి వంగవీటి రాధా రాజీనామా

వైసీపీలో చిచ్చు: మల్లాది విష్ణు చేరికతో మారిన సీన్, రాధా ఏం చేస్తారు?

వైసీపీకి రాజీనామా చేయనున్న వంగవీటి రాధ

వంగవీటి రాధా సీటుపై తేల్చేసిన అంబటి రాం

click me!