రెండు రోజుల్లో భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తా: వంగవీటి రాధా

By Nagaraju TFirst Published Jan 20, 2019, 6:57 PM IST
Highlights

రెండు రోజుల్లో తన భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన భవిష్యత్ కార్యచరణపై తన అభిమానులు, కీలక నేతలతో చర్చించి నిర్ణయం ప్రకటిస్తానని స్పష్టం చేశారు. 
 

విజయవాడ: రెండు రోజుల్లో తన భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన భవిష్యత్ కార్యచరణపై తన అభిమానులు, కీలక నేతలతో చర్చించి నిర్ణయం ప్రకటిస్తానని స్పష్టం చేశారు. 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తాను నాలుగునెలల తొమ్మిదిరోజుల పాటు మౌనంగా ఉన్నానని తెలిపారు. పార్టీ తీసుకున్న నిర్ణయంపై తాను  నాలుగు నెలల తొమ్మిది రోజులపాటు టైమిచ్చానని చెప్పుకొచ్చారు. 

అయితే తాను ఆకస్మాత్తుగా పార్టీకి రాజీనామా చెయ్యలేదని నాలుగు నెలల తొమ్మిది రోజుల తర్వాతే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు అంతా ఓపిక పట్టారని మరో రెండు రోజులు ఓపిక పట్టాలని కోరారు. 

తాను వైసీపీని వీడేందుకు గల కారణాలను తన అనుచరులకు, రంగా రాధ మిత్రమండలి సభ్యులకు వివరించి ఆ తర్వాత నిర్ణయం ప్రకటిస్తానని చెప్పుకొచ్చారు. అయితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని వస్తున్న ప్రచారాలను ఆయన ఖండించారు. 

తాను రాజకీయాల నుంచి వైదొలగాల్సిన అవసరం లేదని తాను రాజకీయాల్లోనే ఉంటానని ప్రజా సేవలోనే ఉంటానని చెప్పుకొచ్చారు. నాలుగు నెలల తొమ్మిదిరోజులపాటు మౌనంగా ఉన్నానని అయితే రెండు రోజుల్లో అంతా బయటపెడతానని చెప్పుకొచ్చారు. 

రాజీనామాకు ముందు వంగవీటి రాధాకృష్ణను వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కలిశారు. విజయవాడ సెంట్రల్ సీటుపై హామీ రాకపోవడంతో రాధాకృష్ణ పార్టీ వీడతారని సమాచారం రావడంతో అలర్ట్ అయిన వైసీపీ అధిష్టానం బొత్స సత్యనారాయణను రంగంలోకి దింపింది. 

అసంతృప్తితో ఉన్న రాధాకృష్ణను బుజ్జగించే ప్రయత్నం చేశారు బొత్స సత్యనారాయణ. బొత్స బుజ్జగింపులు కూడా రాధా విషయంలో పనిచెయ్యలేదు. బొత్స తో చర్చలు ముగిసిన గంటల వ్యవధిలోనే రాధాకృష్ణ వైసీపీకి రాజీనామా చేశారు. 

2019 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు రాధాకృష్ణ సిద్ధమయ్యారు. 

అలాంటి తరుణంలో సెంట్రల్‌ నియోజకవర్గ బాధ్యతలను పార్టీ అధినేత వైఎస్ జగన్‌  మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు అప్పగించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైనా రాధాకృష్ణ పార్టీ నిర్ణయంపై అసంతృప్తితో రగలిపోతున్నారు. 

రాధాకృష్ణకు సన్నిహితంగా ఉండే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానితో పాటు, పలువురు వైకాపా నేతలు బుజ్జగించడంతో రాధాకృష్ణ కొంతకాలం మౌనంగా ఉన్నారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో అంటీ ముట్టనట్లు వ్యవహారిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో మళ్లీ సెంట్రల్‌ టిక్కెట్‌ వ్యవహారం తెరపైకి వచ్చింది. 

వైసీపీ అధిష్టానం రాధాకృష్ణను మచిలీపట్నం పార్లమెంట్‌ అభ్యర్థిగా బరిలో దింపాలని భావిస్తున్నట్లు తెలిసింది. కానీ రాధాకృష్ణ మాత్రం విజయవాడ సెంట్రల్‌ టిక్కెట్‌ పై పట్టువదల్లేదు. అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడం చివరికి రాధాకృష్ణ వైసీపీని వీడారు.
 ఈ సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాజీనామా లేఖ పంపారు. 

పేదల ఆకాంక్షలకు అనుగుణంగానే తన ప్రయాణం ఉంటుందని స్పష్టం చేశారు. పేద ప్రజల స్ఫూర్తి, ఆకాంక్షలకు అనుగుణంగానే తన ప్రయాణం ఉంటుందన్నారు. ప్రజల ఆశయాలను కొనసాగించే దిశలో ప్రయాణం సాగించాలన్నదే తన ఆకాంక్ష అని లేఖలో పేర్కొన్నారు. 

సీఎం కావాలన్న మీ కాంక్ష నెరవేరాలంటే వైసీపీలో అందరికీ ఆంక్షలు విధించడం తప్పనిసరి. నా ఆకాంక్ష నెరవేరాలంటే ఆంక్షలు లేని ప్రజా ప్రయాణం తప్పనిసరి అంటూ జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరి దయా దాక్షిణ్యాలపై ఆధారపడి తాను ఉండలేనని, పోరాటమే తన ఊపిరి అంటూ రాజీనామా లేఖలో రాధాకృష్ణ పొందుపరిచారు. 

 

ఈ వార్తలు కూడా చదవండి

వంగవీటి రాధాకు గేలం వేస్తున్న టీడీపీ

జగన్‌కు షాక్: వైసీపీకి వంగవీటి రాధా రాజీనామా

వైసీపీలో చిచ్చు: మల్లాది విష్ణు చేరికతో మారిన సీన్, రాధా ఏం చేస్తారు?

వైసీపీకి రాజీనామా చేయనున్న వంగవీటి రాధ

వంగవీటి రాధా సీటుపై తేల్చేసిన అంబటి రాంబాబు

వైసీపీ సభ్యత్వ పుస్తకాలు దగ్ధం: అనుచరులతో వంగవీటి రాధా భేటీ

వంగవీటి రాధాకు ‌మరో షాక్: మల్లాది విష్ణు వైపే జగన్ మొగ్గు

వంగవీటి రాధా ఆగ్రహం: బుజ్జగింపులు, ఆ రోజు ఏం జరిగిందంటే...

వైసీపీలో విజయవాడ సెంట్రల్ చిచ్చు: వంగవీటి రాధాతో టచ్‌లోకి టీడీపీ?

వంగవీటి రాధాకు షాక్: మల్లాది విష్ణుకు విజయవాడ సెంట్రల్ సీటు

వైసీపీలో చిచ్చు: రంగా విగ్రహం వద్ద అభిమానుల ధర్నా

వైసీపీలో చిచ్చు: ఆత్మాహత్యాయత్నం చేసిన రాధా అనుచరులు, ఉద్రిక్తత

జనసేనలోకి వంగవీటి శ్రీనివాస ప్రసాద్..

 

click me!