వైసీపీలో చేరిన టీడీపీ నేత తోట త్రిమూర్తులు

By Siva KodatiFirst Published Sep 15, 2019, 1:24 PM IST
Highlights

టీడీపీ సీనియర్ నేత, రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదివారం ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. త్రిమూర్తులుతో పాటు అనుచరులు, కార్యకర్తలు వైసీపీలో చేరారు.

టీడీపీ సీనియర్ నేత, రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదివారం ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు.

త్రిమూర్తులుతో పాటు అనుచరులు, కార్యకర్తలు వైసీపీలో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... నియోజకవర్గం, జిల్లా అభివృద్ధి కోసమే తాను వైసీపీలో చేరుతున్నానని ప్రకటించారు.

రాష్ట్రాభివృద్ధి వైఎస్ జగన్‌తోనే సాధ్యమని.. పార్టీలోని నేతలతో కలిసి తూర్పుగోదావరి జిల్లా అభివృద్ధికి సహకరిస్తానని పేర్కొన్నారు. శనివారం కార్యకర్తలు, అనుచరులతో సమావేశాన్ని ఏర్పాటు చేసిన త్రిమూర్తులు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

అధినేత వ్యాఖ్యల వల్ల మనస్తాపం చెందానని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాతో పాటు రాష్ట్రంలోని కాపు సామాజిక వర్గంలో తోట త్రిమూర్తులకి మంచి పట్టుంది.

1994లో తొలిసారి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి గెలిచిన ఆయన.. 1999లో తెలుగుదేశం అభ్యర్ధిగా విజయం సాధించారు. 2004, 2009లో పిల్లి సుభాష్ చంద్రబోస్ చేతిలో ఓటమి పాలయ్యారు.

మళ్లీ 2014లో విజయం సాధించి... 2019లో వైసీపీ అభ్యర్ధి చెల్లుబోయిన శ్రీనివాస్ చేతిలో ఓడిపోయారు. ఎన్నికల సమయంలోనే త్రిమూర్తులను వైసీపీలోకి తీసుకొచ్చేందుకు ఆమంచి కృష్ణమోహన్ చర్చలు జరిపారు. 

బాబుకు షాక్: తోట త్రిమూర్తులు టీడీపీకి గుడ్‌బై

జ్యోతుల నెహ్రు బుజ్జగింపులు వృధా: వైసీపీలోకి తోట త్రిమూర్తులు

చంద్రబాబుకు తెలుగు తమ్ముళ్లు ఝలక్: మురళీమోహన్ కోడలు కూడా.....

టీడీపీకి మరో ఎదురుదెబ్బ: వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు...?

బీజేపీ నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి: తేల్చేసిన తోట త్రిమూర్తులు

చంద్రబాబుకు తలనొప్పి: టీడీపీలో ప్రజావేదిక చిచ్చు

మేము ఏ పార్టీలోకి వెళ్లడం లేదు: తోట త్రిమూర్తులు

బీజేపీలో రాజ్యసభ ఎంపీల చేరిక చంద్రబాబుకు ముందే తెలుసు

టీడీపీతోనే ఉంటా: రాజకీయాల్లో విలువలు లేవు, సుజనాపై ప్రత్తిపాటి ఫైర్

మేం వేరు: వెంకయ్యకు టీడీపీ రాజ్యసభ ఎంపీల లేఖ

టీడీపీ ఖాళీయే: బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు

బీజేపీలోకి టీడీపీ ఎంపీలు.. మేం ఎవరిని ఆకర్షించలేదు: జీవీఎల్

ఏపీ టీడీపీలో ముసలం: ఎంపీల వ్యవహారం తెలియదన్న కళా వెంకట్రావ్

టీడీపీపై నమ్మకం పోయింది.. పురందేశ్వరి

సంక్షోభం కొత్త కాదు: సీనియర్ నేతలకు బాబు ఫోన్

ఆ నలుగురి బాటలోనే కేశినేని..?

స్పీకర్‌‌ను కలిసిన టీడీపీ లోక్‌సభ ఎంపీలు: మతలబు?

మేము ఏ పార్టీలోకి వెళ్లడం లేదు: తోట త్రిమూర్తులు

click me!