రాజమౌళి అద్భుతమైన దర్శకుడే, కానీ...: పవన్ కల్యాణ్ పై బొత్స ఫైర్

Published : Sep 14, 2019, 11:07 PM ISTUpdated : Sep 14, 2019, 11:13 PM IST
రాజమౌళి అద్భుతమైన దర్శకుడే, కానీ...: పవన్ కల్యాణ్ పై బొత్స ఫైర్

సారాంశం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ విరుచుకుపడ్డారు. రాజమౌళి అద్భుతమైన దర్శకుడే కానీ ఏ విధమైన ఎక్కడ జరగాలో ఆయనకేం తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు.

విజయనగరం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వంద రోజుల పాలనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్  చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ విరుచుకుపడ్డారు. రాజమౌళి అద్భుతమైన దర్శకుడే కానీ ఎక్కడ ఏ విధమైన అభివృద్ధి జరగాలో ఆయనకేం తెలుసునని బొత్స ప్రశ్నించారు. 

ఆడపిల్లలు పాఠశాలకు వెళ్లలేకపోతున్నారంటే అది తమ తప్పు కాదని, పవన్ కల్యాణ్ ప్రశ్నించాల్సింది తమను కాదని గత పాలకులను అని బొత్స సత్యనారాయణ శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. పవన్ కల్యాణ్ పస లేని వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన అన్నారు. 

పవన్ కల్యాణ్ అనుభవరాహిత్యానికి ఈ రోజు చెప్పిన మాటలే నిదర్శనమని ఆయన అన్నారు. చౌకబారు ప్రసంగాలు, పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకుని కార్యక్రమాలు చేయడం తమకు చేత కాదని అన్నారు. పోలవరం రివర్స్ టెండరింగ్ అయ్యే వరకు పవన్ కల్యాణ్ ఆగాలని ఆయన సూచించారు. 

పవన్ కల్యాణ్ మిత్రులు వేసిన కేసులను వెనక్కి తీసుకోవాలని ఆయన సూచించారు. అవినీతిపరులతో రోజూ టచ్ లో ఉంటూ వారికి కొమ్ముకాస్తున్నారని ఆయన పవన్ కల్యాణ్ పై మండిపడ్డారు. రాష్ట్రాన్ని దోచుకు తినడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులకు, అవినీతిపరులకు పవన్ వత్తాసు పలుకుతున్నారని బొత్స విమర్శించారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే