అసలు జరిగిందిదీ...: వివాహిత గ్యాంగ్ రేప్ ఘటనపై డిఎస్పీ విజయభాస్కర్ వివరణ (వీడియో)

By Arun Kumar PFirst Published Sep 9, 2021, 11:23 AM IST
Highlights

గుంటూరు జిల్లాలో బుధవారం అర్ధరాత్రి వివాహితపై జరిగిన సామూహిక అత్యాచారంపై సత్తెనపల్లి డిఎస్పీ విజయభాస్కర్ రెడ్డి స్పందించారు. ఈ ఘటన తర్వాత పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలకు ఆయన వివరణ ఇచ్చారు.

గుంటూరు: బుధవారం రాత్రి గుంటూరు జిల్లా మేడికొండూరు పోలీసు స్టేషన్ పరిధిలో వివాహితపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటనపై సత్తెనపల్లి డిఎస్పీ విజయ భాస్కర్ రెడ్డి స్పందించారు. ఈ ఘటన తర్వాత పోలీస్ స్టేషన్ కు వచ్చిన బాధితులతో సత్తెనపల్లి పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించాన్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదన్నారు. తమ పరిధిలో ఘటన జరగకున్నా సత్తెనపల్లి పోలీసులు వెంటనే స్పందించారని డిఎస్పీ తెలిపారు. 

''బుధవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ కు బాధిత భార్యభర్తలు ఫిర్యాదు చేయడానికి వచ్చారు. నలుగురు దుండగులు తమను అడ్డుకుని దాడిచేశారని... నగలు దోచుకోవడంతో పాటు అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించారని తెలిపారు. పాలడుగు ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని తెలిపారు. దీంతో వెంటనే కానిస్టేబుల్ శ్రీనివాసరావు స్పందించి మేడికొండూరు పోలీసులకు సమాచారం ఇచ్చాడు'' అని డిఎస్పీ తెలిపారు. 

వీడియో

''దీంతో హైవేపై దుండగులను వెతుక్కుంటూ వచ్చిన మేడికొండూరు పోలీసులు 15నిమిషాల్లో సత్తెనపల్లి స్టేషన్ కు చేరుకున్నారు. అక్కడ బాధితులను తమ స్టేషన్ కు తీసుకెళ్లి వివరాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో సత్తెనపల్లి పోలీసులు, మేడికొండూరు పోలీసుల నిర్లక్ష్యమేమీ లేదు. ఎలాంటి ఆలస్యం లేకుండా వారు స్పందించారు. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నది అసత్య ప్రచారం'' అని డీఎస్పీ వివరించారు. 

read more  గుంటూరు మహిళపై గ్యాంగ్ రేప్ దారుణం...బాధితులతో పోలీసుల తీరు మరీ ఘోరం: లోకేష్ సీరియస్

సత్తెనపల్లి మండలానికి చెందిన భార్యాభర్తులు గుంటూరు నగరంలో ఓ వివాహానికి హాజరై తిరిగి వెళ్తుండగా పాలడుగు అడ్డరోడ్డు వద్ద కొందరు దుండగులు అడ్డగించారు. భర్తపై దాడి చేసి భార్యను సమీపంలోని పొలాల్లో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో బాధిత భార్యాభర్తలు అర్థరాత్రి సత్తెనపల్లి పోలీసు స్టేషన్ కు వెళ్లగా ఈ ఘటన తమ పరిధిలో జరగలేదంటూ ఫిర్యాదు తీసుకోడానికి పోలీసులు నిరాకరించారని ప్రచారం జరిగింది. దీనిపైనే సత్తెనపల్లి డిఎస్పీ స్పందించి ఈ ఆరోపణలను తిప్పికొట్టారు. 
 


 

click me!