కారణమిదే: వెబ్ చానెల్స్ ప్రతినిధుల అరెస్ట్

By narsimha lodeFirst Published Jul 25, 2019, 4:02 PM IST
Highlights

నెల్లూరులో వ్యభిచార నిర్వాహకుల నుండి డబ్బులు డిమాండ్ చేసిన వెబ్ చానెల్స్ ప్రతినిధులను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. 2 లక్షలు డిమాండ్ చేసి రూ. 70 వేలు తీసుకొనేందుకు నిందితులు ఒప్పుకొన్నారని పోలీసులు తెలిపారు. 
 

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో  పలు వెబ్ చానెల్స్ కు చెందిన ప్రతినిధులు వ్యభిచార నిర్వాహకుల నుండి రూ. 70వేలు వసూలు చేస్తుండగా దర్గామిట్ట పోలీసులు బుధవారం నాడు అరెస్ట్ చేశారు.

నెల్లూరు జిల్లా కేంద్రంలోని డీ మార్ట్ కు సమీపంలోని మాగుంట లే అవుట్ వద్ద వ్యభిచారం నిర్వహిస్తున్నారని కచ్చితమైన సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో వ్యభిచార నిర్వాహకులిని డబ్బులు చేస్తున్న వెబ్ చానెల్ ప్రతినిధులను కూడ పోలీసులు అరెస్ట్ చేశారు.

అయితే వ్యవభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై దాడి చేసిన సమయంలో  అరెస్టైన వారిని విచారిస్తే తాము వెబ్ చానెల్స్ ప్రతినిధులుగా చెప్పుకొన్నారని పోలీసులు తెలిపారు.

వ్యభిచారం చేస్తున్న నిర్వాహకుల నుండి రూ. 2 లక్షలను వెబ్ చానెల్ ప్రతినిధులు డిమాండ్ చేసినట్టుగా పోలీసులు తెలిపారు. అయితే రూ. 70 వేలు ఇచ్చేందుకు వ్యభిచార నిర్వాహకులు ఒప్పుకొన్నారు. 
 

click me!