వైసీపీలో రాజంపేట టికెట్ లొల్లి: నేనే పోటీ చేస్తానంటున్న మేడా

By Nagaraju TFirst Published Jan 31, 2019, 3:52 PM IST
Highlights

తాజాగా వైసీపీలో చేరిన మేడా మల్లికార్జునరెడ్డి టికెట్ తనదేనని చెప్పుకొచ్చారు. వైఎస్ జగన్ తనకు హామీ ఇచ్చారని స్పష్టం చేశారు. తాను అమర్నాథ్ రెడ్డి ని కలుపుకుని ముందుకు వెళ్తానని వైసీపీని గెలిపించి జగన్ కు బహుమతిగా ఇస్తానని ప్రకటించారు. 

కడప: కడప జిల్లాలో రాజంపేట నియోజకవర్గం వైసీపీలో రాజుకున్న టికెట్ చిచ్చు రాజుకుంటోందా..?వైసీపీ అభ్యర్థిని జగన్ ప్రకటించారా..?జగన్ మద్దతు మేడా మల్లికార్జునరెడ్డికేనా..?మరి జిల్లా ఇంచార్జ్, నియోజకవర్గ సమన్వయకర్త అమర్నాథ్ రెడ్డి పరిస్థితి ఏంటి..?ఇవే కడప జిల్లాలో ప్రతీ ఒక్కరిని ఆలోచింప చేస్తున్న ప్రశ్నలు. 

రాజంపేట నియోజకవర్గానికి వైసీపీ సమన్వయకర్తగా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. జిల్లా ఇంచార్జ్ గా కూడా ఆయనే పనిచేస్తున్నారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మేడా మల్లికార్జునరెడ్డి చేతిలో అమర్నాథ్ రెడ్డి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నియోజకవర్గ సమన్వయకర్తగా జిల్లా ఇంచార్జ్ గా పనిచేస్తున్నారు. 

అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో మేడా మల్లికార్జునరెడ్డి వైసీపీలో చేరిపోయారు. ఈనెల 22న లోటస్ పాండ్ లో చేరి ఈనెల 31న అధికారికంగా పార్టీలో చేరతామంటూ స్పష్టం చేశారు. స్పీకర్ ఫార్మెట్ లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని వైఎస్ జగన్ సూచించడంతో స్పీకర్ ఫార్మెట్ లో ఎమ్మెల్యే పదవికి మేడా మల్లికార్జునరెడ్డి రాజీనామా చేసి లోటస్ పాండ్ లో జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. 

ఇకపోతే మేడా మల్లికార్జునరెడ్డి పార్టీలో చేరడంపై  వైసీపీ సమన్వయకర్త, జిల్లా ఇంచార్జ్ ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి గుర్రుగా ఉన్నారు. తన సీటుకు ఎక్కడ ఎసరువస్తుందోనని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేడా మల్లికార్జునరెడ్డి జగన్ ను కలిసిన రోజే ఆయన అనుచరులతో భేటీ అయ్యారు. 

ఆ భేటీలో మేడా మల్లికార్జునరెడ్డికి వైసీపీ టికెట్ ఇస్తే పార్టీ వీడాలి లేదా ఇండిపెండెంట్ గా అయినా పోటీ చెయ్యాలంటూ అనుచరులు స్పష్టం చేశారు. అవసరం అయితే బిచ్చమెత్తుకుని అయినా గెలిపించుకుంటామని కార్యకర్తలు స్పష్టం చేశారు. 

పార్టీకోసం ఎంతో కష్టపడి పనిచేసిన అమర్నాథ్ రెడ్డిని కాదని మేడా మల్లికార్జునరెడ్డికి ఇస్తే సహించేది లేదని తెగేసి చెప్పారు. కార్యకర్తలతో భేటీ అనంతరం ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి వైసీపీ అధినేత వైఎస్  జగన్ ని కలిశారు. జిల్లా నేతలతో కలిసి వైఎస్ జగన్ ను కలిసిన ఆయన టికెట్ ఎవరికి అనేది జగన్ కే వదిలేసినట్లు స్పష్టం చేశారు.

రాజంపేట టికెట్ ఇంకా ఎవరికీ ఖరారు కాలేదని టికెట్ విషయం పార్టీ అధినేత వైఎస్ జగన్ చూసుకుంటారని చెప్పుకొచ్చారు. జగన్ ఏది చెప్తే అదే చేస్తామని చెప్పుకొచ్చారు. తాను మేడాకు పనిచెయ్యడం లేదని జగన్ కు పనిచేస్తున్నాని చెప్పుకొచ్చారు.  

మళ్లీ రెండు రోజుల క్రితం కార్యకర్తలతో సమావేశమైన ఆయన తనకు పెద్దపెద్ద పదవులు వద్దని ఎమ్మెల్యే టికెట్ ఇస్తే చాలని చెప్పుకొచ్చారు. తాను మేడాకు సహకరించేది లేదని కుండబద్దలు కొట్టారు. తన భవిష్యత్ కార్యచరణ ఈనెల 31న ప్రకటిస్తానంటూ చెప్పుకొచ్చారు. 

తాజాగా వైసీపీలో చేరిన మేడా మల్లికార్జునరెడ్డి టికెట్ తనదేనని చెప్పుకొచ్చారు. వైఎస్ జగన్ తనకు హామీ ఇచ్చారని స్పష్టం చేశారు. తాను అమర్నాథ్ రెడ్డి ని కలుపుకుని ముందుకు వెళ్తానని వైసీపీని గెలిపించి జగన్ కు బహుమతిగా ఇస్తానని ప్రకటించారు. 

వైఎస్ కుటుంబానిక ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి చాలా దగ్గరి వ్యక్తి అని ఆయన సూచనలు సలహాలతోనే ముందుకు పోతానని చెప్పారు. అమర్నాథ్ రెడ్డి కూడా గతంలోనే చెప్పారని టికెట్ ఎవరికి ఇచ్చినా కలిసి పనిచేస్తానని చెప్పారని తనకు సహకరిస్తారని ఆశిస్తున్నట్లు మేడా మల్లికార్జునరెడ్డి తెలిపారు. 

మరి టికెట్ మేడాకు కేటాయిస్తే అమర్నాథ్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్న ఆసక్తికర చర్చ జరుగుతుంది. టికెట్ మేడా మల్లికార్జునరెడ్డికి కన్ఫమ్ చేసినందు వల్లే మేడా పార్టీలో చేరుతున్న కార్యక్రమానికి హాజరుకాలేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.   
 

ఈ వార్తలు కూడా చదవండి

వైసీపీలో చేరిన మేడా మల్లికార్జునరెడ్డి

అభ్యర్థి ఎవరైనా కలిసి పనిచేస్తా, రాజంపేటను గెలిపిస్తా : మేడా మల్లికార్జునరెడ్డి

మేడాకు సహకరించను, నాకు టికెట్ ఇవ్వండి..వైసీపీ నేత

మేడా ఎఫెక్ట్: తాడోపేడో అంటున్న అమర్‌నాథ్ రెడ్డి

రాజంపేట టిక్కెట్టు: బాబును కలిసిన తానా అధ్యక్షుడు వేమన సతీష్

అమరావతిలో రాజంపేట పంచాయతీ: బాబుతో మేడా వ్యతిరేక వర్గం భేటీ

మేడా మల్లిఖార్జున్ రెడ్డి ఔట్: తెరమీదికి చరణ్ రాజు

అవమానిస్తున్నారు: ఆదిపై మేడా మల్లిఖార్జున్ రెడ్డి సంచలనం

టీడీపీలో రాజంపేట లొల్లి: మేడాకు అందని ఆహ్వానం

బాబుకు షాక్: ఎమ్మెల్యే మల్లిఖార్జున్ రెడ్డి వైసీపీ వైపు చూపు

 

 

click me!