నిరుద్యోగ భృతి రూ.2 వేలకు పెంపు: చంద్రబాబు

By narsimha lodeFirst Published Jan 31, 2019, 3:23 PM IST
Highlights

 నిరుద్యోగులకు ప్రస్తుతం అమలు చేస్తున్న నిరుద్యోగ భృతిని పెంచాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. ఈ మేరకు ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే నాటికి నిరుద్యోగ భృతిని రూ.రెండు వేలను ఇవ్వనున్నారు. 

అమరావతి: నిరుద్యోగులకు ప్రస్తుతం అమలు చేస్తున్న నిరుద్యోగ భృతిని పెంచాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. ఈ మేరకు ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే నాటికి నిరుద్యోగ భృతిని రూ.రెండు వేలను ఇవ్వనున్నారు. 

2014 ఎన్నికల సమయంలో టీడీపీ మేనిఫెస్టోలో  నిరుద్యోగులకు నిరుద్యోగ భృతిని అమలు చేస్తామని  చంద్రబాబునాయుడు ప్రకటించారు. నిరుద్యోగ భృతికి సంబంధించి ప్రస్తుతం  నెలకు వెయ్యి రూపాయాలను అందిస్తున్నారు.  

మరో వైపు వెయ్యి రూపాయాలకు మరో వెయ్యి రూపాయాలను జోడించనున్నట్టు  చంద్రబాబునాయుడు చెప్పారు. ఎన్నికల నోటీఫికేషన్  వెలువడే సమయం నాటికి ఈ పెంపును  అమల్లోకి తీసుకురానున్నారు.

ఈ విషయాన్ని  గురువారం నాడు అమరావతిలో జరిగిన టీడీఎల్పీ సమావేశంలో చంద్రబాబునాయుడు  టీడీపీ ప్రజా ప్రతినిదులకు వివరించారు. రాష్ట్రంలోని ప్రతి కులానికి సంక్షేమ పథకాలు అమలయ్యేలా చర్యలు తీసుకొన్నామని  బాబు వివరించారు.

కుల సంఘాలతో ప్రజా ప్రతినిధులు మమేకం కావాలని చంద్రబాబునాయుడు పార్టీ ప్రజా ప్రతినిధులకు సూచించారు. త్వరలోనే ఎమ్మెల్సీ  ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో  పెండింగ్ పనులను పూర్తి చేసుకోవాలని చంద్రబాబునాయుడు  పార్టీ ప్రజా ప్రతినిధులకు సూచించారు.

సంబంధిత వార్తలు

టార్గెట్ 2019: నెల రోజుల పాటు బాబు ప్రచారం

 

click me!