నర్సరావుపేట నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా కోడెల

By narsimha lode  |  First Published Sep 16, 2019, 1:13 PM IST

ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సోమవారం నాడు ఆత్మహత్య చేసుకొన్నారు. ఆయన నర్సరావు పేట నుండి ఐదు దఫాలు ఎమ ్మెల్యేగా విజయం సాధించారు. 



హైదరాబాద్: అవశేష ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తొలి స్పీకర్ గా పనిచేసిన కోడెల శివప్రసాదరావు ఆరు దఫాలు నర్సరావుపేట నుండి విజయం సాధించారు.  2014 లో కోడెల శివప్రసాదరావు సత్తెనపల్లి నుండి విజయం సాధించారు.

నర్సరావుపేట అసెంబ్లీ స్థానం నుండి  ఆయన వరుసగా విజయం సాధించారు. ఎన్టీఆర్ పిలుపును అందుకొని కోడెల శివప్రసాదరావు టీడీపీలో చేరారు. గుంటూరు జిల్లాలో కోడెల శివప్రసాదరావు తనదైన ముద్ర వేశారు. గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో పల్నాడు పులిగా కార్యకర్తలతో కోడెల శివప్రసాదరావు పిలిపించుకొన్నారు.

Latest Videos

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కోడెల శివప్రసాదరావు టీడీపీలో కీలక పాత్ర పోషించారు. గుటూరు జిల్లా  గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కండ్లగుంటలో 1947 మే 2న కోడెల శివప్రసాదరావు జన్మించారు. కోడెలకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.

నర్సరావుపేట అసెంబ్లీ స్థానం నుండి 1983, 1985, 1989, 1994,1999 ఎన్నికల్లో కోడెల శివప్రసాదరావు  విజయం సాధించారు. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు మంత్రివర్గాల్లో కోడెల శివప్రసారావు మంత్రిగా పనిచేశారు. 

1996-97 భారీ మధ్యతరహా, నీటిపారుదల మంత్రిగా, 197-99 మధ్యలో పంచాయతీరాజ్‌ శాఖమంత్రిగా కోడెల పనిచేశారు. 2014-19 వరకూ ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా ఆయన పనిచేశారు. 2019 ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు చేతిలో ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో  సత్తెనపల్లి నుండి ఇదే అసెంబ్లీ స్థానం నుండి ఆయన విజయం సాధించారు.

సంబంధిత వార్తలు

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య

కోడెల కుమారుడి కేసులో రెండో నిందితుడి అరెస్ట్

ట్విస్ట్: డీఆర్‌డీఏ వాచ్‌మెన్‌కు 30 ల్యాప్‌టాప్‌‌లు అప్పగింత

శ్వాస తీసుకోవడానికి కోడెల ఇబ్బంది: ప్రభుత్వ ఒత్తిడి వల్లనే...

నిలకడగా కోడెల ఆరోగ్యం... హైదరాబాద్ కి తరలింపు?

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు గుండెపోటు

కోడెల కుటుంబంపై మరో కేసు: 30 ల్యాప్‌టాప్ లు ఎక్కడ?

నా ఆఫీసులో చోరీ వెనుక వైసీపీ.. దుండగుడు ఆ పార్టీ వ్యక్తే: కోడెల

కోడెల ఇంట్లో చోరీ: కంప్యూటర్లను ఎత్తుకెళ్లిన మాజీ ఉద్యోగులు, పలు అనుమానాలు

దొంగతనం చేసి పరువు తీశారు.. కోడెలపై విజయసాయి విమర్శలు

అధికారాన్ని అభివృద్ధికి వాడండి.. బురద జల్లడానికి కాదు: కోడెల

అసెంబ్లీ ఫర్నిచర్ నేనే వాడుకున్నా..డబ్బులు కట్టేస్తా: కోడెల

అసెంబ్లీ ఫర్నిచర్ మాయం: కోడెల మెడకు మరో ఉచ్చు..?

కోడెల ఇంటికి అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపుపై విచారణ : చీఫ్ మార్షల్ పై తొలివేటు

click me!