మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య

By narsimha lode  |  First Published Sep 16, 2019, 12:28 PM IST

మాజీ ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహాత్యాయత్నానికి పాల్పడ్డాడు.చికిత్స పొందుతూ ఆయన  సోమవారం నాడు ఆసుపత్రిలో కన్నుమూశారు.


టీడీపీ సీనియర్ నేత, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సోమవారం నాడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.చికిత్స పొందుతూ  ఆయన హైద్రాబాద్ లోని బసవతారకం ఆసుపత్రిలో కన్నుమూశారు.

ఏపీలో ఎన్నికల ఫలితాల అనంతరం కోడెల శివప్రసాదరావుతో పాటు ఆయన కుటుంబంపై పలు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులపై కోడెల శివప్రసాదరావు కుటుంబసభ్యులు కోర్టును కూడ ఆశ్రయించారు.

Latest Videos

undefined

కొద్ది రోజుల క్రితం గుండెనొప్పి కారణంగా ఆయన అస్వస్థతకు గురయ్యారు. చికిత్స అనంతరం ఆయన కోలుకొన్నారు. వరుసగా కోడెల శివప్రసాదరావుతో పాటు ఆయన కుటుంబంపై కేసులు నమోదయ్యాయి. ఈ తరుణంలో కోడెల శివప్రసాదరావు మానసిక ఒత్తిడికి గురైనట్టుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

2014 ఎన్నికల్లో సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి  కోడెల శివప్రసాదరావు విజయం సాధించారు. సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో కోడెల కొడుకు, కూతురులు తీవ్రంగా జోక్యం చేసుకొన్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కుటుంబసభ్యులను కోడెల శివప్రసాదరావు కట్టబడి చేయలేకపోయారనే ఆరోపణలు కూడ వచ్చాయి.

కోడెల కుటంబంపై పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి. కేసులు కూడ నమోదయ్యాయి. ఈ తరుణంలో  కోడెల శివప్రసాదరావు సోమవారం నాడు ఉదయం  హైద్రాబాద్‌లోని తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

ఈ ఘటనలో కోడెల శివప్రసాదరావును కుటుంబసభ్యులు బసవతారకం ఆసుపత్రికి తరలించారు. ఆయనకు శ్వాస అందడంలో ఇబ్బంది నెలకొందని వైద్యులు చెబుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ప్రకటించారు. చికిత్స పొందుతూ కోడెల శివప్రసాదరావు మృతి చెందినట్టుగా వైద్యులు ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

కోడెల కుమారుడి కేసులో రెండో నిందితుడి అరెస్ట్

ట్విస్ట్: డీఆర్‌డీఏ వాచ్‌మెన్‌కు 30 ల్యాప్‌టాప్‌‌లు అప్పగింత

శ్వాస తీసుకోవడానికి కోడెల ఇబ్బంది: ప్రభుత్వ ఒత్తిడి వల్లనే...

నిలకడగా కోడెల ఆరోగ్యం... హైదరాబాద్ కి తరలింపు?

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు గుండెపోటు

కోడెల కుటుంబంపై మరో కేసు: 30 ల్యాప్‌టాప్ లు ఎక్కడ?

నా ఆఫీసులో చోరీ వెనుక వైసీపీ.. దుండగుడు ఆ పార్టీ వ్యక్తే: కోడెల

కోడెల ఇంట్లో చోరీ: కంప్యూటర్లను ఎత్తుకెళ్లిన మాజీ ఉద్యోగులు, పలు అనుమానాలు

దొంగతనం చేసి పరువు తీశారు.. కోడెలపై విజయసాయి విమర్శలు

అధికారాన్ని అభివృద్ధికి వాడండి.. బురద జల్లడానికి కాదు: కోడెల

అసెంబ్లీ ఫర్నిచర్ నేనే వాడుకున్నా..డబ్బులు కట్టేస్తా: కోడెల

అసెంబ్లీ ఫర్నిచర్ మాయం: కోడెల మెడకు మరో ఉచ్చు..?

కోడెల ఇంటికి అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపుపై విచారణ : చీఫ్ మార్షల్ పై తొలివేటు

click me!