సీనియర్లకు షాక్: విధేయులకే జగన్ పట్టం

By narsimha lodeFirst Published Jun 7, 2019, 7:19 PM IST
Highlights

పార్టీని నమ్ముకొని తన వెంట నడిచిన  విధేయులకే జగన్ కేబినెట్‌లో చోటు కల్పించారు.  సామాజిక వర్గాల వారీగా  కూడ సమతుల్యం పాటించే ప్రయత్నం చేశారు.
 

అమరావతి: పార్టీని నమ్ముకొని తన వెంట నడిచిన  విధేయులకే జగన్ కేబినెట్‌లో చోటు కల్పించారు.  సామాజిక వర్గాల వారీగా  కూడ సమతుల్యం పాటించే ప్రయత్నం చేశారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో  జగన్ ఓదార్పు యాత్రకు కొందరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మద్దతుగా నిలిచారు. వైఎస్ జగన్  వైఎస్ఆర్‌సీపీని ఏర్పాటు చేసిన కాలంలో  బహిరంగంగానే ఎమ్మెల్యేలు ఆయన వెంట నడిచారు. ఆ సమయంలో  మంత్రులుగా ఉన్న వారు కూడ తమ మంత్రి పదవులకు రాజీనామాలు సమర్పించి జగన్ వెంట నడిచారు.

2012లో జరిగిన ఉప ఎన్నికల్లో జగన్ వెంట నడిచిన ఎమ్మెల్యేలు వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2014 ఎన్నికల్లో ఏపీ రాష్ట్రంలో  టీడీపీ అధికారంలోకి వచ్చింది. వైసీపీ అధికారానికి దూరమైంది. 

2019 ఎన్నికల్లో  వైసీపీ భారీ మెజారిటీతో విజయం సాధించింది.  టీడీపీ కేవలం 23 ఎమ్మెల్యేలకు మాత్రమే పరిమితమైంది. తొలి నుండి తన వెంట నడిచిన వారికి జగన్ తన మంత్రివర్గంలో చోటు కల్పించారు.

పార్టీ ఏర్పాటు చేసిన నాటి నుండి ఇప్పటివరకు తన వెంట నడిచిన వారికి కేబినెట్‌లో చోటు కల్పించారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  మంత్రిగా పనిచేసిన పిల్లి సుభాష్ చంద్రబోస్ మంత్రి పదవికి రాజీనామా చేసి జగన్ వెంట నడిచారు. ఈ దఫా పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు జగన్ తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఇప్పటికే ఆయనకు ఎమ్మెల్సీ పదవి కల్పించారు. 

మరో వైపు జగన్ వెంట మొదటి నుండి ఉన్న మోపిదేవి వెంకటరమణకు జగన్ చోటు కల్పించారు. మోపిదేవి  వెంకటరమణ ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో మంత్రిగా ఉన్న సమయంలో జగన్ ఆస్తుల కేసులో జైలు శిక్షను కూడ అనుభవించారు. గుంటూరు జిల్లా రేపల్లే నుండి ఈ దఫా మోపిదేవి వెంకటరమణ పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. అయినా కూడ మోపిదేవికి జగన్ తన మంత్రివర్గంలో చోటు కల్పించారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడ జగన్‌కు మొదటి నుండి వెన్ను దన్నుగా నిలిచారు. దీంతో బాలినేని శ్రీనివాస్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు కల్పించారు. ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి మేకతోటి సుచరిత కూడ జగన్ వెంట మొదటి నుండి నడిచింది. ఆమెకు కూడ జగన్ తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. సుచరితకు కీలకమైన శాఖను కేటాయించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాల్లో  ప్రచారంలో ఉంది.

ధర్మాన కృష్ణదాస్ మొదటి నుండి  జగన్ వెంటే ఉన్నారు. ఆయన సోదరుడు ధర్మాన ప్రసాదరావు కిరణ్ కుమార్ రెడ్డి  మంత్రివర్గంలో  మంత్రిగా పనిచేశారు. సోదరులు వేర్వేరు పార్టీల్లో కొనసాగారు. అయితే ఇటీవల కాలంలోనే ధర్మాన ప్రసాదరావు వైసీపీలో చేరారు. ప్రసాదరావు వైఎస్ఆర్ హాయాంలో మంత్రిగా పనిచేశారు. ఆయనను కాదని ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్ కు మంత్రి పదవి కట్టబెట్టారు జగన్.

టీడీపీ ఎమ్మెల్యేగా ఉంటూనే వైసీపీ వైపు మొగ్గు చూపిన కృష్ణా జిల్లా కొడాలి నానికి  వైఎస్ జగన్ తన మంత్రివర్గంలో చోటు కల్పించారు.  చిత్తూరు జిల్లా నుండి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్ వైపుకు నిలిచారు. చిత్తూరు జిల్లా నుండి  చంద్రబాబునాయుడు, కిరణ్ కుమార్ రెడ్డిలు ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో కూడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీలోనే కొనసాగారు. జిల్లాలో పార్టీని సమర్ధవంతంగా నడిపించారు. పార్టీకి అవసరమైన ఆర్ధిక సేవలను అందించారు. ఈ కారణంగానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి  కేబినెట్‌లో చోటు కల్పించారు.

ఇక నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కుటుంబం కూడ మొదటి నుండి జగన్‌ వెంట నడిచింది.  ఈ దఫా నెల్లూరు సిట్టింగ్ ఎంపీ స్థానాన్ని కూడ మేకపాటి రాజమోహన్ రెడ్డి త్యాగం చేశారు. ఈ స్థానంలో టీడీపీ నుండి చివరి నిమిషంలో చేరిన ఆదాల ప్రభాకర్ రెడ్డికి సీటిచ్చారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. దీంతో ఈ జిల్లా నుండి మేకపాటి గౌతంరెడ్డికి చోటు కల్పించారు.

2009 ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నుండి టీడీపీ నుండి విజయం సాధించిన తానేటి వనిత.... ఆ తర్వా వైసీపీలో చేరారు. గత ఎన్నికల్లో ఆమె వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ దఫా ఆమె మరోసారి పోటీ చేసి విజయం సాధించారు. సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆమెకు జగన్ తన కేబినెట్ లో చోటు కల్పించారు.

సంబంధిత వార్తలు

వైఎస్ జగన్ మంత్రుల ప్రమాణస్వీకారానికి ముహుర్తం ఇదే

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా కోన రఘుపతి

రోజాకు జబర్ధస్త్ షాక్: జగన్ కొలువులో 25 మంది వీరే

చంద్రబాబుకు కౌంటర్: నామినేటేడ్ పోస్టుల్లో బీసీలకు పెద్దపీట

జగన్‌లో ఊహించని మార్పు: వైసీపీ ఎమ్మెల్యేల జోష్

ప్రమాణానికి రెడీగా ఉండండి, సాయంత్రం విజయసాయి ఫోన్లు: జగన్

నాతో పాటు ఇబ్బందులు పడ్డారు: వైఎస్‌ఆర్‌సీఎల్పీ సమావేశంలో జగన్ భావోద్వేగం

జగన్ కేబినెట్‌లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు, వీరే?

మంత్రివర్గం ఏర్పాటుపై జగన్ సంచలన నిర్ణయం

రాష్ట్రమంతా మనవైపే చూస్తుంది: ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం

విజయసాయి ఫోన్లు: జగన్ కొలువులో మంత్రులు వీరే (లైవ్ అప్‌డేట్స్)

click me!