అరకు ఘటన: గన్‌మెన్లతో సర్వేశ్వరావు చివరి మాటలివే....

By narsimha lodeFirst Published Sep 25, 2018, 10:44 AM IST
Highlights

మావోయిస్టులపై కాల్పులు జరపొద్దని అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు సూచన మేరకు గన్‌మెన్లు మావోలపై కాల్పులు జరపకుండా ఉన్నారని సమాచారం.


అరకు: మావోయిస్టులపై కాల్పులు జరపొద్దని అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు సూచన మేరకు గన్‌మెన్లు మావోలపై కాల్పులు జరపకుండా ఉన్నారని సమాచారం. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు సమాచారాన్ని సేకరించారు. ఈ ఘటనలో ప్రత్యక్షసాక్షుల నుండి పోలీసు ఉన్నతాధికారులు సమాచారాన్ని సేకరించినట్టు తెలుస్తోంది.

గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా  లిప్పిటిపుట్టు  వద్ద   మావోయిస్టులు  ఆదివారం నాడు అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివిరి సోమలను కాల్చి చంపారు.

ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులు  సేకరిస్తున్నారు.  లిప్పిటిపుట్టు వద్దకు ఎమ్మెల్యే వాహనం చేరుకోగానే  మావోయిస్టులు చుట్టుముట్టారు.  అయితే మావోలు తుపాకులు ఎక్కుపెట్టడంతో  గన్‌మెన్లు  కూడ తమ ఆయుధాలతో సిద్దంగా ఉన్నారు. ఈ తరుణంలో మావోయిస్టులతో తాను మాట్లాడుతానని గన్‌మెన్లను  సర్వేశ్వరరావు చెప్పారని సమాచారం.

తుపాకులను గురిపెట్టకూడదని గన్‌మెన్లకు సర్వేశ్వరరావు సూచించినట్టు తెలుస్తోంది.  తాను మావోలతో మాట్లాడుతానని సర్వేశ్వరరావు గన్‌మెన్లకు సూచించినట్టు సమాచారం.  ఒకవేళ కాల్పులు జరిపితే   ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని సర్వేశ్వరరావు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే గన్‌మెన్లు  ఫైరింగ్ ఓపెన్  చేయలేదని  సమాచారం. 

మావోయిస్టులు మాట్లాడేందుకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే  సివిరి సోమలను  తీసుకెళ్లే సమయంలో  ఏదైనా జరిగితే ఇద్దరితోనే అయిపోతోంది... కాల్పులు జరిపితే  అందరికి ఇబ్బందిద అవుతోందని సర్వేశ్వరరావు  గన్‌మెన్లను వారించారని సమాచారం. ఈ ఘటన జరిగిన సమయంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ల వాహానాల్లో  ఎవరెవరు ఉన్నారు.. ఎంతమంది ఆ వాహనాల్లో ప్రయాణం చేశారనే విషయమై కూడ పోలీసులు ఆరా తీశారు. 

అరకు దాటిన తర్వాత ఎవరైనా ఈ వాహనాల్లో ఎక్కారా.... సంఘటన స్థలంలో ఏం జరిగిందనే విషయమై కూడ  పోలీసులు ప్రత్యక్షసాక్షుల నుండి  సమాచారాన్ని సేకరించినట్టు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

ఎమ్మెల్యే హత్య: పోలీసుల చేతిలో వీడియో ఫుటేజ్.. పారిపోతున్న ఆ ఇద్దరు ఎవరు..?

కిడారి హత్య.. కుటుంబానికి రూ.42లక్షల పరిహారం

అరకు ఘటన: అక్కడే నెల రోజులుగా మావోల శిక్షణ

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను హత్య చేసిన మావోలు వీళ్లే

కొనసాగుతున్న సర్వేశ్వరరావు అంతిమయాత్ర

కిడారికి ముందే పోలీసుల హెచ్చరిక: నోటీసు ఇదే

అరకు ఘటన: బైక్‌పై సంఘటనా స్థలానికి పోలీస్ బాస్‌లు, ఎందుకంటే?

కూతురితో సర్వేశ్వరరావు చివరి మాటలివే...

మా సమాచారమంతా మావోల వద్ద ఉంది: వెంకటరాజు

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హత్య: ఆర్కే లేడు, చలపతి ప్లాన్

బాక్సైట్ తవ్వకాలే ప్రాణాలు తీసాయా

15ఏళ్ల తర్వాత ప్రముఖుడిని హతమార్చిన మావోలు

నిన్న రాత్రే ఫోన్ చేశారు, ఇంతలోనే: కిడారి హత్యపై నక్కా ఆనందబాబు

నన్ను కూడ బిడ్డలా చూసుకొనేవాడు: సర్వేశ్వరరావు భార్య

అరకు ఘటన: డుబ్రీగుంట, అరకు పోలీస్‌స్టేషన్లపై దాడి, నిప్పు (వీడియో)

తొలుత సోమను చంపి... ఆ తర్వాతే సర్వేశ్వరరావు హత్య

మాజీ ఎమ్మెల్యే సోమ మావోయిస్టులకు చిక్కాడిలా....

పోలీసులకు చెప్పకుండానే గ్రామదర్శినికి వెళ్తూ మార్గమధ్యలోనే ఇలా....

వాహనంలో ఎవరెవరున్నారని ఆరా తీసి....కాల్పులు: ప్రత్యక్షసాక్షి

గన్‌మెన్ల ఆయుధాలు లాక్కొని కాల్పులు: డీఐజీ

మావోల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ మృతి (వీడియో)

ఆ క్వారే కొంపముంచిందా: సర్వేశ్వరరావుపై దాడి వెనుక..
ఎమ్మెల్యే హత్య: అమెరికాలోని బాబుకు సమాచారం

ఎమ్మెల్యే హత్య: దాడిలో 60 మంది మావోలు.. 40 మంది మహిళలే

 

 

click me!