కిడారి హత్య.. కుటుంబానికి రూ.42లక్షల పరిహారం

By ramya neerukondaFirst Published Sep 25, 2018, 10:41 AM IST
Highlights

మృతిచెందిన ఎమ్మెల్యేల కుటుంబంలో డిగ్రీ చదివిన పిల్లలుంటే వారికి డిప్యూటీ కలెక్టర్‌ హోదాతో కూడిన ఉద్యోగం లోగడ ప్రభుత్వం ఇచ్చింది. ఇదే విధానం కిడారి కుటుంబానికి వర్తిస్తుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. 
 

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు ఆదివారం మావోయిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా.. ఆయన కుటుంబానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.42 లక్షల పరిహారం అందనుంది. ప్రభుత్వానికి పంపే నివేదికలో అధికారులు ఈ ప్రతిపాదన చేసినట్లు సమాచారం. 

 మృతిచెందిన ఎమ్మెల్యేల కుటుంబంలో డిగ్రీ చదివిన పిల్లలుంటే వారికి డిప్యూటీ కలెక్టర్‌ హోదాతో కూడిన ఉద్యోగం లోగడ ప్రభుత్వం ఇచ్చింది. ఇదే విధానం కిడారి కుటుంబానికి వర్తిస్తుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. 

మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కుటుంబానికి రూ.12 లక్షల వరకూ పరిహారాన్ని చెల్లించనున్నారు. ప్రత్యేకంగా మాజీ ఎమ్మెల్యేలకంటూ ప్రభుత్వ ఉత్తర్వులలో ప్రస్తావన లేదు. ఈ కారణంగా మావోల చేతిలో పౌరులు చనిపోతే ఎంతమేర పరిహారం చెల్లిస్తారో అంతే సోమ కుటుంబానికి ఇవ్వనున్నారు. ఇవికాక ప్రభుత్వం అదనపు ప్రయోజనాలను ప్రకటిస్తే ఆమేరకు రెండు కుటుంబాలకు అందజేయనున్నారు.

ఇవి కూడా చదవండి

అరకు ఘటన: అక్కడే నెల రోజులుగా మావోల శిక్షణ

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను హత్య చేసిన మావోలు వీళ్లే

చంద్రబాబు, నేదురుమల్లి.. మావోల పంజాకి చిక్కిన వారి జాబితా పెద్దదే

కిడారికి ముందే పోలీసుల హెచ్చరిక: నోటీసు ఇదే...

కూతురితో సర్వేశ్వరరావు చివరి మాటలివే...

click me!