జగన్ విధ్వంసక చర్యల వల్ల ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు ఆగిపోయిందన్నారు చంద్రబాబు. గత ముఖ్యమంత్రులంతా తెలివిలేని వాళ్లా?, జగన్ పతివ్రత, హానెస్ట్ పర్సన్, నీతిమంతుడిలా మాట్లాడుతున్నారంటూ తిట్టిపోశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. జగన్ ఏదో హానెస్ట్ పర్సనల్ మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు.
జగన్ విధ్వంసక చర్యల వల్ల ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు ఆగిపోయిందన్నారు చంద్రబాబు. గత ముఖ్యమంత్రులంతా తెలివిలేని వాళ్లా?, జగన్ పతివ్రత, హానెస్ట్ పర్సన్, నీతిమంతుడిలా మాట్లాడుతున్నారంటూ తిట్టిపోశారు.
undefined
పోలవరం టెండర్ షెడ్యూల్‌లో ఎందుకు మార్పులు చేశారో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రజల కల అని గుర్తుచేశారు. ఒకరిని దృష్టిలో పెట్టుకుని రీ టెండరింగ్ ప్రక్రియ చేపట్టారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.
తెలుగుప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును ఏకపక్ష నిర్ణయంతో ఆపేశారంటూ ధ్వజమెత్తారు. దేశచరిత్రలో ఎక్కడా జరగని విధంగా ఏపీలో మాత్రమే జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. భారీ ప్రాజెక్టులు రివర్స్ టెండరింగ్ కు పోలేదని తెలిపారు.
సీఎం జగన్ బంధువు పీటర్ ఇచ్చిన నివేదక ఆధారంగా ముందుకు పోతున్నారంటూ విరుచుకుపడ్డారు. కేంద్రం హెచ్చరించినా, నిపుణుల కమిటీ వద్దని చెప్పినా వినకుండా ఈ ప్రభుత్వం ముందుకుపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గోదావరిలో బోటు మునిగిపోతే ఇంత వరకూ కనిపెట్టలేని వాళ్లు పోలవరం రీటెండరింగ్ గురించి మాట్లాడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైతే వ్యయం కూడా పెరుగుతుందని నిపుణులు తేల్చారని చెప్పుకొచ్చారు.
భవిష్యత్ లో ఏదైనా జరగరానిది జరిగితే ఉభయగోదావరి జిల్లాల్లో ఒక్క గ్రామం కూడా మిగలదన్నారు. తన ఇంటికి నోటీస్ అంటించిన అంత సులువుగా పోలవరం నిర్మించలేరంటూ సెటైర్లు వేశారు.
జగన్ కి చేతకాకపోతే నిపుణులు చెప్పింది అయినా వినాలని కానీ దాన్ని కూడా వినరని విమర్శించారు. జగన్ ప్రభుత్వం టెర్రరిజాన్ని చూసి మీడియా సైతం భయపడిపోతుందని చంద్రబాబు నాయుడు ఆరోపించారు.
ఈ వార్తలు కూడా చదవండి
కాంట్రాక్టర్లకు జగన్ సర్కార్ షాక్: అడ్వాన్స్ ల రికవరీ
పోలవరం రివర్స్ టెండర్లు: సెప్టెంబర్ 4 తర్వాతే ముందుకు
రివర్స్ టెండరింగ్: డివిజన్ బెంచ్ ను ఆశ్రయించిన ఏపీ సర్కార్
షెకావత్‌తో జగన్ భేటీ:పోలవరంపై కేంద్ర మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
రీ టెండర్ల ద్వారానే పోలవరం పనులు: పెద్దిరెడ్డి
జగన్ కు కేంద్రం పిలుపు, హస్తినకు బయలుదేరిన ఏపీ సీఎం: అమిత్ షాతో భేటీ
రివర్స్ టెండరింగ్ రచ్చ: జగన్ ఢిల్లీ టూర్, ఏం జరుగుతుంది?
రివర్స్ టెండరింగ్: కేంద్రానికి పీపీఏ నివేదిక ఇదీ...
పోలవరం కాంట్రాక్ట్ రద్దుపై డివిజన్ బెంచ్ కు జగన్ సర్కార్
రివర్స్ టెండరింగ్ వద్దని హైకోర్టు చెప్పలేదు, న్యాయనిపుణులతో చర్చిస్తున్నాం: మంత్రి అనిల్
జగన్ ఇప్పుడేం చెబుతారు: పోలవరంపై హైకోర్టు ఉత్తర్వులపై బాబు
జగన్‌కు హైకోర్టు షాక్: రివర్స్ టెండరింగ్ పై మధ్యంతర ఉత్తర్వులు
తగ్గని జగన్: పోలవరం అథారిటీకి కౌంటర్
పోలవరంపై నవయుగ పిటిషన్: వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్
పోలవరం: జగన్ సర్కార్ నిర్ణయంపై కోర్టుకెక్కిన నవయుగ
జగన్‌కు షాక్: రివర్స్ టెండరింగ్‌పై పీపీఏను నివేదిక కోరిన కేంద్రం
సీఈఓ లేఖ బేఖాతరు: పోలవరం పనులకు రివర్స్ టెండర్ల ఆహ్వానం
రివర్స్ టెండరింగ్ పై సీఈఓ లేఖ: జగన్ నిర్ణయంపై ఉత్కంఠ
నష్టమే: రివర్స్ టెండరింగ్‌పై జగన్ సర్కార్ కు జైన్ లేఖ
సీఈవో హెచ్చరికలు బేఖతారు: పోలవరంపై మడిమ తిప్పని జగన్