
అమరావతి: అన్నా... మీకు చాలా బరువైన బాధ్యతలు అప్పగిస్తున్నా.... ఈ బాధ్యతలను నిర్వహించాలని తనకు ఏపీ సీఎం జగన్ చెప్పారని ఏపీ శాసనసభ స్పీకర్‌గా ప్రమాణం చేయనున్న తమ్మినేని సీతారాం చెప్పారు.
శుక్రవారం నాడు ఓ తెలుగు న్యూస్ చానెల్‌కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. వైఎస్‌ఆర్‌సీఎల్పీ సమావేశం ముగిసిన తర్వాత తాను వెళ్లిపోతున్న సమయంలో వైఎస్ జగన్ నుండి తనకు ఫోన్ వచ్చిందని తమ్మినేని సీతారాం గుర్తు చేసుకొన్నారు.
జగన్ ఎందుకు ఫోన్ చేశాడో తనకు అర్ధం కాలేదన్నారు. తను జగన్‌ను వద్దకు చేరుకోగానే అన్నా మీకు బరువైన బాధ్యతలు అప్పగిస్తున్నా.... ఏపీ శాసనసభకు స్పీకర్‌గా బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నానని ఆయన చెప్పారు. అయితే ఈ విషయమై తాను సంతోషంగా స్వీకరించనున్నట్టు చెప్పానని ఆయన ప్రస్తావించారు.
ఏపీ శాసనసభను ఉన్నత విలువలున్న అసెంబ్లీగా తీర్చిదిద్దనున్నట్టుగా తమ్మినేని సీతారాం చెప్పారు. స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాజకీయాలకు , రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తానని ప్రకటించారు. అవసరమైతే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడ రాజీనామా చేయడానికి కూడ తనకు అభ్యంతరం లేదన్నారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలని అధినేత ఆదేశిస్తే రాజీనామాకు కూడ సిద్దమన్నారు.
ఏపీ శాసనసభ స్పీకర్‌గా గతంలో పనిచేసినవారు నెలకొల్పిన ఉన్నత విలువలు, సంప్రదాయాలను కొనసాగిస్తానని సీతారాం చెప్పారు. శాసనసభను హుందాగా నడిపిస్తానని ఆయన చెప్పారు. ఈ దఫా సుమారు 100 మంది కొత్త ఎమ్మెల్యేలు శాసనసభకు ఎన్నికయ్యారని.... వారందరికీ శాసనసభపై అవగాహన కోసం శిక్షణ ఇప్పిస్తానని సీతారాం తెలిపారు.
సంబంధిత వార్తలు
వైఎస్ జగన్ మంత్రుల ప్రమాణస్వీకారానికి ముహుర్తం ఇదే
విజయసాయి ఫోన్లు: జగన్ కొలువులో మంత్రులు వీరే (లైవ్ అప్‌డేట్స్)
చంద్రబాబుకు కౌంటర్: నామినేటేడ్ పోస్టుల్లో బీసీలకు పెద్దపీట
జగన్‌లో ఊహించని మార్పు: వైసీపీ ఎమ్మెల్యేల జోష్
ప్రమాణానికి రెడీగా ఉండండి, సాయంత్రం విజయసాయి ఫోన్లు: జగన్
నాతో పాటు ఇబ్బందులు పడ్డారు: వైఎస్‌ఆర్‌సీఎల్పీ సమావేశంలో జగన్ భావోద్వేగం
జగన్ కేబినెట్‌లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు, వీరే?
మంత్రివర్గం ఏర్పాటుపై జగన్ సంచలన నిర్ణయం
రాష్ట్రమంతా మనవైపే చూస్తుంది: ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం