డైరెక్టర్ వద్ద డాక్యుమెంట్ ఉందన్న భయంతోనే తప్పించారు:సీబీఐపై చంద్రబాబు

Published : Oct 24, 2018, 08:15 PM ISTUpdated : Oct 24, 2018, 08:17 PM IST
డైరెక్టర్ వద్ద డాక్యుమెంట్ ఉందన్న భయంతోనే తప్పించారు:సీబీఐపై చంద్రబాబు

సారాంశం

 సీబీఐలో నెలకొన్న వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. సీబీఐ అంతా అవినీతి ఊబిలో కూరుకుపోయిందని ఆరోపించారు. సీబీఐ లాంటి కీలక వ్యవస్థలలో రాజకీయ నాయకుల జోక్యం ఉండకూడదని చంద్రబాబు తెలిపారు. మోడీ ప్రభుత్వం సీబీఐని భ్రష్టు పట్టించిందని మండిపడ్డారు.

అమరావతి: సీబీఐలో నెలకొన్న వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. సీబీఐ అంతా అవినీతి ఊబిలో కూరుకుపోయిందని ఆరోపించారు. సీబీఐ లాంటి కీలక వ్యవస్థలలో రాజకీయ నాయకుల జోక్యం ఉండకూడదని చంద్రబాబు తెలిపారు. మోడీ ప్రభుత్వం సీబీఐని భ్రష్టు పట్టించిందని మండిపడ్డారు. రాఫెల్ స్కాంపై విచారణ చేస్తారనే భయంతోనే సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను అనధికారికంగా తొలగించారని ఆరోపించారు. 

ప్రధాని నరేంద్ర మోదీ వద్ద పనిచేసే సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాను కాపాడటం కోసమే సీబీఐ డైరెక్టర్ ను సెలవులపై పంపించారని విమర్శించారు. సీవీసీ అనుమతులు లేకుండా సీబీఐ డైరెక్టర్ ను ఎలా మారుస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. సీబీఐ డైరెక్టరుగా నియామకం జరిగిన తర్వాత రెండేళ్లు కొనసాగించాలని తెలిపారు.

సీబీఐ డైరెక్టర్ వద్ద డాక్యుమెంట్ ఉంటే ఇబ్బందని అనధికారికంగా తప్పించారని మండిపడ్డారు. బీజేపీ అవినీతి బయటపడుతుందన్న భయంతోనే సీబీఐలో జోక్యం చేసుకుంటుందని చంద్రబాబు ఆరోపించారు.

ఈ వార్తలు కూడా చదవండి

అంతర్యుద్ధం: రాత్రికి రాత్రి 15 మంది బదిలీ, కొత్త సిట్ ఏర్పాటు

సీబీఐలో అలోక్ Vs ఆస్థానా: ఒకనాటి కథ కాదు

రేప్ కేసులో తొలిసారి డిఎన్ఎ ఫింగర్ ప్రింటింగ్ వాడింది నాగేశ్వర రావే

సీబీఐ చీఫ్‌గా రెండో తెలుగోడు: ఎవరీ నాగేశ్వరరావు

మోడీ భయపెట్టే స్థితి తెచ్చారు: సీబీఐలో అంతర్యుద్దంపై విపక్షాలు

2ఎఎం ఆర్డర్, హైడ్రామా: సిబిఐ చీఫ్, ఆయన డిప్యూటీలపై కొరడా

దేశచరిత్రలోనే తొలిసారిగా.. ఢిల్లీలోని సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌లో సోదాలు

సీబీఐ కొత్త డైరెక్టర్‌గా తెలుగు ఐపీఎస్

సీబీఐ స్పెషల్ డైరెక్టర్ కు ఊరట:అరెస్ట్ చేయెుద్దన్న ఢిల్లీ హైకోర్టు

సతీష్ సానా ఇష్యూ: సిఎం రమేష్ ఇరుక్కున్నారా, టీడీపికి చిక్కులే...

జగన్ కేసు: అప్పటి నుండే సీబీఐ దర్యాప్తులో సతీష్ సానా పేరు

సీబీఐలో అంతర్యుద్దం: ఎవరీ సతీష్‌బాబు

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్