శతమానం భవతి అంటున్న చంద్రబాబు

By Nagaraju TFirst Published Oct 24, 2018, 6:45 PM IST
Highlights

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళలతో సమావేశమయ్యారు. తెలుగుదేశం ప్రభుత్వం మహిళల పక్షపాతి ప్రభుత్వం అంటూ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా శతమానం భవతి క్యాసెట్ ను చంద్రబాబు ఆవిష్కరించారు.. మహిళల సంక్షేమం కోసం తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను తెలియజేస్తూ శతమానం భవతి క్యాసెట్ ను రూపొందించారు. 

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళలతో సమావేశమయ్యారు. తెలుగుదేశం ప్రభుత్వం మహిళల పక్షపాతి ప్రభుత్వం అంటూ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా శతమానం భవతి క్యాసెట్ ను చంద్రబాబు ఆవిష్కరించారు.. మహిళల సంక్షేమం కోసం తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను తెలియజేస్తూ శతమానం భవతి క్యాసెట్ ను రూపొందించారు. 

డ్యాక్రా మహిళల సమావేశంలో ఈ క్యాసెట్ ను చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. తనకు డ్వాక్రా మహిళలతో సమావేశమైనప్పుడు ఎంతో ఉత్సాహం వస్తుందని చంద్రబాబు తెలిపారు. ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా డ్వాక్రా అక్కచెళ్లెల్ల తో సమావేశమైతే అవన్నీ ఆవిరైపోతాయన్నారు.  

ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కష్టాలొచ్చినప్పుడు కృంగిపోవద్దని దాన్ని అధిగమించేందుకు ప్రయత్నించాలని సూచించారు. తాను ప్రస్తుతం చేస్తున్నది అదేనని చెప్పుకొచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత కట్టుబట్టలతో రాష్ట్రానికి వచ్చానని తెలిపారు. 

కనీసం ప్రభుత్వ కార్యాలయం కూడా లేదని కేవలం బస్సులో ఉండే పాలన చేశానని తెలిపారు. అయితే ప్రతీ సమస్యను అధిగమించేందుకు ప్రయత్నించానని ప్రతీదాన్ని ఒక సవాల్ గా తీసుకున్నానని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలతోపాటు ఇవ్వని హామీలను కూడా అమలు చేశానని చంద్రబాబు గుర్తు చేశారు. 

డ్వాక్రా మహిళలు కోరుకుంటున్న అద్భుత పాలన అందించానని చెప్పుకొచ్చారు. హుదూద్, తిత్లీ తుఫాన్ లు రాష్ట్రాన్ని కకావికలం చేశాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రప్రభుత్వానికి సంబంధించిన వాళ్లెవరు పర్యటించలేదన్నారు. 

త్వరలో కేంద్ర బృందం పర్యటిస్తోందని చెప్తున్నారని అంతా సెట్ చేసిన తర్వాత ప్రయత్నిస్తే ఏం తెలుస్తోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చఏశారు. అంత ఘోరమైన తుఫాన్ వచ్చినా కేవలం 8 మంది చనిపోయారంటే మనం తీసుకుంటున్న జాగ్రత్తలే అందుకు నిదర్శనమన్నారు. 

click me!