
ఢిల్లీ: ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై జరిగిన హత్యాయత్నం కేసులో అసలు దొషులను తప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నారని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. జగన్ పై దాడి కేసును కేంద్ర సంస్థలతో విచారణ జరిపించాలని కోరుతూ ఆ పార్టీ నేతలు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు.
జగన్ పై దాడి కేసును సీఎం చంద్రబాబు, డీజీపీ ఆర్పీ ఠాకూర్‌లు చిన్నదిగా చూపే ప్రయత్నం చేస్తున్నారని బొత్స మండిపడ్డారు. జగన్‌పై జరిగిన హత్యాయత‍్నం వెనుక కుట్ర ఉందని తాము భావిస్తున్నట్టు తెలిపారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం సిట్‌తో దర్యాప్తు చేయించాలని కోరారు. హత్యాయత్నం జరిగిన ప్రదేశం తమ ఆధీనంలో లేదని చంద్రబాబు అన్నారు కాబట్టే కేసును కేంద్రానికి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నట్ల తెలిపారు.
దాడి జరిగిన ఐదు నిమిషాల్లోనే పబ్లిసిటీ కోసమే చేశారని డీజీపీ అనడం రాజకీయ రంగు పులమడమేనని బొత్స విమర్శించారు. సీఎం, డీజీపీలు ఈ కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అసలు దోషులను పక్కకు తప్పించే ప్రణాళికలు రచించారని నిజాలు నిగ్గు తేలాలంటే కేంద్ర దర్యాప్తు అవసరమన్నారు.
వైసీపీ నుంచి గెలిచిన 26 మంది ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి తమ వైపుకు తిప్పుకున్న టీడీపీకి పేదరికాన్ని ఆసరాగా చేసుకుని చిన్నపాటి వ్యక్తిని తమ వైపు తిప్పుకోవడం పెద్ద విషయమేమీ కాదని ఆరోపించారు.
కేంద్రం దర్యాప్తు చేపట్టాలన్న తమ వినతిపై రాజ్‌నాథ్ సింగ్ సానుకూలంగా స్పందించారని బొత్స తెలిపారు. రాష్ట్రంలో ఎమ్మెల్యే హత్య, మహిళలపై అత్యాచారాలు వరుసగా జరుగుతున్నాయని అసలు శాంతి భద్రతలు చాలా కాలం నుంచే కరువయ్యాయని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
జగన్‌పై దాడి సినీ నటుడు శివాజీ ప్లానా: బీజేపీ
జగన్‌పై దాడికి విజయమ్మ, షర్మిల కుట్ర: టీడీపీ ఎమ్మెల్సీ సంచలన ఆరోపణలు
జగన్ చెప్పిందే రిమాండ్ రిపోర్ట్‌లో: వైజాగ్ సీపీ
జగన్‌పై దాడి: వైసీపీ పిటిషన్‌పై విచారణ బుధవారానికి వాయిదా
జగన్ వాంగ్మూలం కోసం న్యాయస్థానానికి ఏపీ పోలీసులు
జగన్‌పై దాడి: కిచెన్‌లో ఉండాల్సిన శ్రీనివాసరావు సర్వీస్ బోయ్‌గా ఎందుకు
జగన్‌పై దాడి: ఏపీ పోలీసులు వద్దంటూ కోర్టుకెక్కిన వైసీపీ
జగన్‌పై దాడి: మరోసారి చంద్రబాబు అదే మాట
వైజాగ్ ఘటన: మరోసారి జగన్ స్టేట్‌మెంట్‌కు సిట్ రెడీ
జగన్‌పై దాడి: సీబీఐ విచారణ జరిపించండి..రాజ్‌నాథ్‌ని కోరిన వైసీపీ నేతలు
జగన్‌పై దాడి: సీసీటీవి పుటేజీ స్వాధీనం, శ్రీనివాసరావు కదలికలపై ఆరా