పార్టీలు మారలేదు, వింగ్ ను బీజేపీలో విలీనం చేశాం: బొత్సకు సుజనా కౌంటర్

By Nagaraju penumalaFirst Published Aug 27, 2019, 8:44 PM IST
Highlights

సుజనాచౌదరి బీజేపీలోకి వెళ్లినా ఇంకా టీడీపీ వ్యక్తిగానే మాట్లాడుతున్నారంటూ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. సుజనాచౌదరి వ్యాఖ్యల్లో టీడీపీ వాసన పోలేదంటూ అభిప్రాయపడ్డారు. చంద్రబాబు చేసిన ఆరోపణలనే బీజేపీలో ఉంటూ చేస్తున్నారంటూ బొత్స ఆరోపించారు.

హైదరాబాద్: ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు గట్టి కౌంటర్ ఇచ్చారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి. తాను పార్టీలు మారలేదని, రాజ్యసభలోని తమ వింగ్ ను బీజేపీలో విలీనం చేసినట్లు సుజనాచౌదరి స్పష్టం చేశారు.  

సుజనాచౌదరి బీజేపీలోకి వెళ్లినా ఇంకా టీడీపీ వ్యక్తిగానే మాట్లాడుతున్నారంటూ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. సుజనాచౌదరి వ్యాఖ్యల్లో టీడీపీ వాసన పోలేదంటూ అభిప్రాయపడ్డారు. చంద్రబాబు చేసిన ఆరోపణలనే బీజేపీలో ఉంటూ చేస్తున్నారంటూ బొత్స ఆరోపించారు.

రాజధానిలో తన బంధువులకు భూములు ఉన్నాయంటూ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బొత్స సత్యనారాయణ అసత్య ప్రచారం చేయోద్దన్నారు. 

బొత్స సత్యనారాయణ అంటే తనకు ఎంతో గౌరవం ఉందన్నారు. బాధ్యతగల మంత్రిగా ఉన్న బొత్స వ్యాఖ్యలు సరిగ్గా ఉండాలని అంతేగానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడేసి వెళ్లిపోతే కుదరదన్నారు. కాలయాపన చేసే విధంగా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. 

మూడు నెలలు రాష్ట్రానికి ఏమీ చేయలేదని దాన్ని కప్పిపుచ్చుకునేందుకు తనను టార్గెట్ చేశారంటూ మండిపడ్డారు. తాను బీజేపీలోకి వెళ్లినప్పటి నుంచి వైసీపీకి వెన్నులో వణుకు మెుదలైందన్నారు. రాజధానికి సామాజికవర్గంతో ముడిపెట్టడం సరికాదని హితవు పలికారు.

తెలుగు ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తి కావాలని ఐదేళ్లలో అనేక సార్లు కేంద్రం సహాయం చేసిందని చెప్పుకొచ్చారు. డీపీఆర్‌ ఆమోదం జరగకుండానే కొత్త ప్రభుత్వం వచ్చిందని తెలిపారు. 

పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారం వ్యవహరించొద్దని జలశక్తి మంత్రి షెకావత్‌ హెచ్చరించినట్లు తెలిపారు. పీపీఏ రిపోర్ట్‌ కూడా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.  పోలవరం రివర్స్‌ టెండరింగ్‌ అంశాన్ని గందరగోళంలో పెట్టారని మండిపడ్డారు. 

ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం తెలివితక్కువగా చేస్తోందా?. అనుభవం లేక చేస్తోందా అనేది అర్థం కావడం లేదన్నారు. రాత్రికి రాత్రి అన్న క్యాంటీన్లను మూసివేశారు. రాజన్న క్యాంటీన్‌ అని కంటిన్యూ చేసి ఉంటే పేదలకు ఉపయోగపడేదని సుజనాచౌదరి వైసీపీ ప్రభుత్వానికి సూచించారు.

ఈ వార్తలు కూడా చదవండి

రాజధానికి ముందే భూములు: బొత్స‌కు సుజనా కౌంటర్

బాలకృష్ణ వియ్యంకుడికి చంద్రబాబు 493 ఎకరాలు కట్టబెట్టారు: చిట్టావిప్పిన బొత్స

ఒక సెంటు భూమి లేదన్నారు, ఈ 124 ఎకరాల సంగతేంటి : సుజనా చిట్టావిప్పిన బొత్స

14ఏళ్లు సీఎం, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే ఇదేనా చంద్రబాబూ!: బొత్స సంచలన వ్యాఖ్యలు

14ఏళ్లు సీఎం, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే ఇదేనా చంద్రబాబూ!: బొత్స సంచలన వ్యాఖ్యలు

జగన్ వ్యూహం ఇదే: చంద్రబాబు పేరు వినిపించకుండా...
అమరావతిపై బొత్స వ్యాఖ్యల వెనుక జగన్: యనమల

నాకు అంగుళం భూమి వున్నా చూపించండి: బొత్సకు సుజనా సవాల్

అమరావతిపై జగన్ ఆలోచన: వెనక్కి తగ్గని టీజీ వెంకటేష్

మోడీతో జగన్ లింక్స్: సుజనాతో విభేదిస్తున్న టీజీ వెంకటేష్

అమరావతి: జగన్ ప్లాన్ ఇదీ, టీజీ వెంకటేష్ మాటల ఆంతర్యం అదీ...

అమరావతి భూముల చిట్టా విప్పుతా: సుజనాకు బొత్స కౌంటర్

అమరావతికి జగన్ చెల్లుచీటీ: టీజీ వెంకటేష్ కు రఘురాం కౌంటర్

బీజేపీ రక్తంలోనే ఉంది..నాలుగు రాజధానులపై స్పందించిన టీజీ

అమరావతికి చెల్లు చీటీ, జగన్ ఆలోచన ఇదీ: టీజీ వెంకటేష్ సంచలనం

ఏ ఒక్క సామాజికవర్గానిది కాదు: అమరావతిపై బొత్స మరోసారి సంచలనం

click me!