ఫలించిన పోలీసుల ఎత్తు.. తల్లిదండ్రుల ముందు కొందరి పేర్లు చెప్పిన శ్రీనివాసరావు

By sivanagaprasad kodatiFirst Published Nov 1, 2018, 10:44 AM IST
Highlights

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో దాడికి పాల్పడిన శ్రీనివాసరావును పోలీసులు గత వారం రోజులుగా విచారిస్తున్న సంగతి తెలిసిందే. 

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో దాడికి పాల్పడిన శ్రీనివాసరావును పోలీసులు గత వారం రోజులుగా విచారిస్తున్న సంగతి తెలిసిందే.

విశాఖ ఎయిర్‌పోర్ట్ పీఎస్‌లో సిట్ అధికారులతో పాటు స్వయంగా నగర పోలీస్ కమిషనర్ మహేశ్ చంద్ర లడ్హా శ్రీనివాసరావును ప్రశ్నిస్తున్నారు. ఎన్ని సార్లు అడిగినా తాను ఉద్దేశ్యపూర్వకంగానే జగన్‌పై దాడి చేశానని.. తన వెనుక ఎవరు లేరని చెప్పిందే చెబుతున్నాడు.

రెస్టారెంట్ యాజమాని, అతని స్నేహితులు, తోటి సిబ్బంది, కాల్ డేటా, బ్యాంకు ఖాతాలు ఇలా ప్రతి దానిని జల్లెడ పట్టిన పోలీసులకు అతని నుంచి సమాధానం మాత్రం రాబట్టలేకపోయారు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం అతని తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించారు.

విశాఖ ఎయిర్‌పోర్ట్ పీఎస్‌కు చేరుకున్న తల్లిదండ్రులను చూడగానే...శ్రీనివాసరావు ఉద్వేగానికి లోనై కంటతడి పెట్టాడు. వారిని ఎదురుగా కూర్చోబెట్టిన సిట్ అధికారులు అతన్ని విచారించారు. సుమారు 3 గంటల పాటు జరిగిన విచారణలో అతను కొన్ని వివరాలతో పాటు.. కొందరి పేర్లను చెప్పినట్లుగా తెలుస్తోంది. 

మళ్లీ అనారోగ్యానికి గురైన శ్రీనివాస్...ఎయిర్ పోర్టు పీఎస్‌లోనే వైద్యం

మిస్డ్ కాల్ వస్తే ఫోన్ చేశా: జగన్‌‌పై దాడి కేసులో గుంటూరు మహిళ

దాడి జరిగిన తర్వాత జగన్ విశాఖలో ఎందుకు ఆగలేదంటే......

శ్రీనివాస్ కి భద్రత కల్పిస్తాంః:హోం మంత్రి చినరాజప్ప భరోసా

సిట్ అధికారులను శ్రీనివాస్ తల్లిదండ్రులు ఏం కోరారంటే...

చంద్రబాబు ప్రతివాదిగా కోర్టులో పిటిషన్: జగన్ వాదన ఇదీ

జగన్ పైదాడి.. నిందితుడు శ్రీనివాసరావుని చంపేందుకు కుట్ర?

నవంబర్ 6న దాడిపై ప్రజలకు వివరణ ఇవ్వనున్న జగన్

జగన్‌పై దాడి: ఆ నలుగురితో శ్రీనివాసరావు సంభాషణ

జగన్‌పై దాడి: ఇద్దరు గుంటూరు మహిళల విచారణ

శివాజీని చంపి జగన్‌పైకి నెడతారు.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

జగన్‌పై దాడికి ముందు శ్రీనివాస్ నుంచి ఆ మహిళకే ఎక్కువ ఫోన్ కాల్స్

శ్రీనివాస్ విచారణకు సహకరించడం లేదు, కొన్ని విషయాలు దాస్తున్నాడు:సీపీ లడ్డా

click me!