వెదురు సాగుతో అదిరే లాభాలు.. ఎకరాకు రూ. 20వేల పెట్టుబడి.. ఏడాదికి రూ. 2 లక్షల రాబడి

వాణిజ్య పంటలతో అదిరే లాభాలు వస్తాయని తెలిసిందే. అందులోనూ వెదురు సాగు వేస్తే సిరుల పంటేనని ఉద్యానవన శాఖ చెబుతున్నది. ఇప్పుడు థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో వెదురు గుళికలు వాడాలని కేంద్రం ఆదేశించడంతో అనూహ్యంగా వెదురుకు మార్కెట్‌లో భారీగా డిమాండ్ ఏర్పడింది. రూ. 20 వేల పెట్టుబడితో ఎకరంలో సాగు చేస్తే.. ఏడాది కాలంలో ఏపుగా పెరుగుతుంది. దాని విలువ మార్కెట్‌లో రూ. 1 లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు ఉంటుంది.
 

bamboo cultivation is a profitable option in agriculture

హైదరాబాద్: వాణిజ్య పంటలతో రాబడి అధికంగా ఉంటుందన్నది అందరికీ తెలిసిందే. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న ముడిసరుకులపై ఓ కన్నేసి సరైన సాగు (Cultivation) చేస్టే కాసుల పంటే. వరి సాగు కంటే వాణిజ్య పంటలు ఎక్కువ లాభాలు తెచ్చిపెడుతున్నాయి. ఉద్యానవన శాఖ ఇలాంటి విషయాన్ని వెల్లడించింది. వెదురును సాగు చేస్తే బంగారాన్ని సాగు చేసినట్టేనని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. వెదురు (Bamboos)ను ఒక ఎకరంలో రూ. 20 వేల పెట్టుబడితో సాగు చేస్తే ఏడాదికి రూ. 2 లక్షల ఆదాయం పొందవచ్చని ఉద్యానవన శాఖ చెబుతున్నది.

దేశవ్యాప్తంగా వెదురు సాగు (Agriculture)కు భారీగా డిమాండ్ ఉన్నది. ఇటీవలి కాలంలోనే వెదురుకు డిమాండ్ భారీగా పెరిగింది. ఇప్పుడు థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో వెదురు గుళికలు వినియోగించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బొగ్గు వినియోగంతో ఎక్కువ వాయు కాలుష్యం ఏర్పడుతున్నదని, దానికి బదులు వెదురు గుళికలు వినియోగించాలని సూచించింది. తద్వార థర్మల్ విద్యుత్ కేంద్రాలకు భారీగా వెదురు గుళికలు అవసరం పడుతున్నాయి. ఈ అవసరమే.. వెదురు సాగును లాభాల బాటలో నడిపించనుంది. 

రూ. 20 వేల పెట్టుబడితో ఎకరం భూమిలో వెదురు సాగు చేస్తే.. అది ఏపుగా పెరగడానికి ఏడాది కాలం పడుతుంది. ఈ వెదురు బొంగులకు మార్కెట్‌లో లక్ష రూపాయల నుంచి రెండు లక్షల రూపాయల వరకు ధర రానుంది.

రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో 24.74 లక్షల టన్నుల వెదురు బొంగులు అవసరం పడుతున్నది. వీటి మార్కెట్ విలువ సుమారు రూ. 2,969,85 కోట్లుగా ఉంటుందని ఉద్యానవన శాఖ తమ అధ్యయనంలో తేల్చింది. దాదాపు లక్ష ఎకరాల్లో వెదురు సాగు చేస్తే థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సరిపడా వెదురు గుళికలు అందుబాటులోకి వస్తాయని వివరించింది.

ఒడిశాలోని అంగూల్ ప్రాంతంలో జిందాల్ ఇండియా థర్మల్ పవర్ కంపెనీ కొత్తగా రెండు ప్లాంట్‌లను నెలకొల్పుతున్నది. 600 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్లాంట్‌లను ఏర్పాటు చేయనుంది. ఈ రెండు ప్లాంట్లకు 26 వేల టన్నుల వెదురు గుళికలు అవసరం పడుతుందని టెండర్లు కూడా పిలిచింది.

దేశవ్యాప్తంగా థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి వెలువడే  కాలుష్యాన్ని నియంత్రించడానికి బొగ్గుకు బదులుగా వెదురు గుళికలు వాదాలని కేంద్రం తన కొత్త ఇంధన విధానంలో పేర్కొంది. వెదురు గుళికలు తప్పనిసరిగా వాడాలని ఆదేశాలు జారీ చేసింది. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు వినియోగం వల్ల ఏటా 21 లక్షల టన్నులకు పైగా బొగ్గు పులువు వాయువులు వాతావరణంలోకి ఉద్గారితం అవుతున్నది. దీని వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతున్నదని కేంద్ర విద్యుత్ శాఖ ఓ రిపోర్టులో వెల్లడించింది. అందుకే బొగ్గును కాల్చే సమయంలో ఏడు శాతం వెదురు గుళికలను వాడాలని కేంద్రం స్పష్టం చేసింది.

ఈ డిమాండ్ దృష్యా వెదురు సాగు చేయాలని ఉద్యానవన శాఖ ప్రోత్సహిస్తున్నది. వెదురును సాగు చేయడం అంటే బంగారం పండించినట్టేనని చెప్పకనే చెప్పింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios