స్టాక్ మార్కెట్ మళ్లీ రెడ్ మార్క్‌లో ముగిసింది. నేడు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ 30-షేర్ సెన్సెక్స్ ఇండెక్స్ 237 పాయింట్లు (0.41 శాతం) నష్టపోయి 58,339 వద్ద ముగిసింది, అయితే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 55 పాయింట్లు (0.31 శాతం) పడిపోయి 17,476 వద్ద ముగిసింది.
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.. ఓవైపు శాంతి చర్చలు అంటూనే.. మరోవైపు అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర ఆంక్షలు ఎదురవుతున్నా.. యుద్ధం కొనసాగిస్తోంది రష్యా. ఈ నేపథ్యంలో చాలా సంస్థల ఆ దేశానికి గుడ్‌బై చెప్పేస్తున్నాయి. తాజాగా, రష్యాకు ప్రముఖ టెలికం పరికరాల తయారీ సంస్థ నోకియా షాక్ ఇచ్చింది.
మంగళవారం స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో సెషన్‌కు దిగువన ముగిశాయి. ముగింపులో, సెన్సెక్స్ 388.20 పాయింట్లు క్షీణించి 58,576.37 వద్ద, నిఫ్టీ 144.70 పాయింట్లు తగ్గి 17,530 వద్ద ముగిసింది.
దేశీయ స్టాక్ మార్కెట్లపై జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు ప్రతికూల ప్రభావాల్ని చూపుతున్నాయి. దీంతో సోమవారం ఉదయం స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
Stock Market: స్టాక్ మార్కెట్లు వరుస మూడు రోజుల నష్టాల నుంచి రిలీఫ్ ర్యాలీని పొందాయి. ఆర్బీఐ మానిటరీ పాలసీ సమావేశంలో కీలక వడ్డీ రేట్లను యధాతథ స్థితిలో కొనసాగించడాన్ని మార్కెట్లు పాజిటివ్ గా స్వీకరించాయి. అంతేకాదు సెన్సెక్స్ ఏకంగా 412 పాయింట్ల లాభంతో ముగిసింది.
Stock Market: స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు కూడా నష్టాల్లో ముగిశాయి. ఆర్బీఐ ఎంపీసీ భేటీ కానున్న నేపథ్యంలో మదుపరులు అమ్మకాలక మొగ్గు చూపారు. దీంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలోని నష్టాల ఒత్తిడి కూడా దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం కూడా నష్టాల్లో ముగిశాయి. బలహీనమైన ప్రపంచ మార్కెట్ సంకేతాల కారణంగా, ఆటో, బ్యాంక్. IT పేర్లలో అమ్మకాలు కనిపించాయి. దీంతో సెన్సెక్స్ 60 వేల పాయింట్ల దిగువకు జారుకుంది.
ఈరోజు సెన్సెక్స్ 435.24 పాయింట్ల నష్టంతో 60176 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ 96 పాయింట్లు పతనమై 17957.40 వద్ద ముగిసింది. నిఫ్టీ తన కీలకమైన 18000 పాయింట్ల దిగువన ముగిసింది.
సోమవారం మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. బిఎస్ఇ సెన్సెక్స్ 60,000 పాయింట్ల ఎగువన తిరిగి రావడం, గత దాదాపు నెల రోజుల్లో ఇన్వెస్టర్ల సంపద రూ. 30 లక్షల కోట్ల మేర పెరగడం వంటి కారణాలతో మార్కెట్ ఇప్పుడు బలమైన రికవరీ కనిపిస్తోంది.
స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో దూసుకెళ్తున్నాయి. నిఫ్టీ 18000 పాయింట్లు లాభపడగా, సెన్సెక్స్ ఏకంగా 1500 పాయింట్లు లాభపడింది. ముఖ్యంగా HDFC, HDFC Bank మర్జర్ వార్తలతో మార్కెట్లోని ఈ హెవీ వెయిట్ స్టాక్స్ కోొనుగోళ్లకు బూస్ట్ అందిస్తున్నాయి.