పిల్లలు బాధ్యతాయుతమైన పౌరుడిగా ఎదగడంలో తల్లిదండ్రుల పాత్రే కీలకం అవుతుంది. ముఖ్యంగా అబ్బాయిలు చెడు దారి పట్టకుండా, అమ్మాయిల పట్ల చెడుగా ప్రవర్తించకుండా ఉండాలంటే తండ్రి మార్గదర్శకత్వం ఎంతో అవసరం. నాన్న తన పిల్లాడికి ఒక స్నేహితుడు, మెంటర్, రోల్ మోడల్ గా ఉండాలి. ప్రతి తండ్రి తన కొడుక్కి అన్న విషయాలూ నేర్పించలేడు. కానీ చాలా విషయాలు తండ్రి ప్రవర్తన చూసే నేర్చుకుంటాడు కొడుకు. కాబట్టి కొన్ని విషయాల్లో తండ్రి ఆదర్శంగా ఉండాలి.