ఆడవాళ్లు కాళ్లకు నల్లదారం ఎందుకు కట్టుకుంటారో తెలుసా?
చిన్న పిల్లలకే కాకుండా ఆడవాళ్లు కూడా కాళ్లకు నల్లదారాన్ని ఎక్కువగా కట్టుకుంటుంటారు. అసలు ఆడవాళ్లు నల్లదారాన్ని ఎందుకు కట్టుకుంటారు? దీనివల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
చాలా మంది ఆడవారు చేతి మణికట్టుకు లేదా కాళ్లకు నల్ల తాడును కట్టుకుంటారు. కొంతమంది స్టైల్ కోసం దీన్ని కడితే.. మరికొంతమంది నమ్మకాల వల్ల కట్టుకుంటారు. కాలికి నల్లదారం కట్టుకోవడం వల్ల మన శరీరానికి సంబంధించిన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా భారతదేశంలో ఈ సంప్రదాయం ఎన్నో ఏండ్ల నుంచి వస్తోంది. అసలు ఆడవారు నల్లదారం ఎందుకు కట్టుకుంటారు? దీన్ని కట్టుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
నల్లదారం సంప్రదాయం
కాళ్లకు నల్ల దారాన్ని కట్టుకునే సంప్రదాయాన్ని మన దేశ ఆడవాళ్లు ఎన్నో ఏండ్లుగా పాటిస్తూ వస్తున్నారు. చాలా సంస్కృతుల్లో.. నలుపును దుష్ట శక్తులు, ప్రతికూల శక్తులను తరిమికొట్టే రక్షిత రంగుగా పరిగణిస్తున్నారు. కాళ్లకు నల్ల దారాన్ని కట్టుకోవడం వల్ల హాని నుంచి రక్షించబడతామని, ఆరోగ్యంగా ఉంటామని నమ్ముతారు.
కాళ్లకు నల్లదారం కట్టడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
కాళ్లకు నల్లదారం కట్టడం వల్ల ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నమ్ముతారు. సాధారణంగా నమ్మే ప్రయోజనాల్లో.. మన శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపడుతుందనేది ఒకటి. కాళ్ల చుట్టూ ఉన్న తాడు కలిగించే ఒత్తిడి రక్త ప్రవాహాన్ని మెరుగుపర్చడానికి, రక్తం గడ్డకట్టడం, ఇతర ప్రసరణ సమస్యల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాదు కొంతమంది ఆడవారు కాలికి నల్ల తాడు కట్టడం వల్ల శరీర నొప్పి, అసౌకర్యం తగ్గుతుందని నమ్ముతారు. ఈ తాడు కలిగించే ఒత్తిడి సహజ ఆక్యుప్రెషర్ బిందువుగా పనిచేస్తుంది. ఇది కాలు కండరాలను నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
కాళ్లకు నల్ల తాడును కల్లడం వల్ల మనశ్శాంతి కలుగుతుందని కూడా నమ్ముతారు. నలుపు రంగు గ్రౌండింగ్, స్థిరత్వంతో సంబంధం కలిగి ఉంటుందని చెప్తారు. ఇది ఆడవాళ్లు రోజంతా మరింత ఏకాగ్రతగా, ప్రశాంతంగా ఉండటానికి సహాయపడుతుంది.