సోనాక్షి కి మనీషా కోయిరాలా పెళ్లి గిఫ్ట్ ఏంటో తెలుసా? దాని స్పెషాలిటీ ఇదే..!
చాలా ఫంక్షన్స్ లో బహుమతికి బదులు తక్కువ ఖర్చుతో అయిపోతుంది కదా అని పూలబొకేలు ఇస్తూ ఉంటారు. దాంట్లో స్పెషాలిటీ ఏముంది అని మీరు అనుకోవచ్చు. కానీ. ఈ పూల బొకే మాత్రం నిజంగా స్పెషల్ అనే చెప్పొచ్చు.
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా రీసెంట్ గా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లిని చాలా సింపుల్ గా చేశారు. తర్వాత గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేయగా.. చాలా మంది బాలీవుడ్ సెలబ్రెటీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. చాలా మంది సెలబ్రెటీలు ఈ జంటకు ఖరీదైన బహుమతులు ఇచ్చారు. అయితే.... వీరిలో సీనియర్ హీరోయిన్ మనీషా కోయిరాలా ఇచ్చిన బహుమతి మాత్రం చాలా స్పెషల్ అని చెప్పాలి.
నిజానికి మనీషా కోయిరాలా వీరి పెళ్లి రిసెప్షన్ కి రాలేదు. కానీ.. ఆమె బహుమతిని మాత్రం పంపించారు. ఆ బహుమతి ఉన్న గోల్డెన్ కవర్ తో పాటు..అందమైన పూల బొకేఇచ్చారు. ఆ గిఫ్ట్ ర్యాప్ లో ఏముందో తెలీదు కానీ.. పూల బొకే మాత్రం కెమేరాలకు చిక్కింది. ఏంటి..? పూల బొకే ఇవ్వడం కూడా స్పెషలేనా అని మీరు అనుకోవచ్చు. చాలా ఫంక్షన్స్ లో బహుమతికి బదులు తక్కువ ఖర్చుతో అయిపోతుంది కదా అని పూలబొకేలు ఇస్తూ ఉంటారు. దాంట్లో స్పెషాలిటీ ఏముంది అని మీరు అనుకోవచ్చు. కానీ. ఈ పూల బొకే మాత్రం నిజంగా స్పెషల్ అనే చెప్పొచ్చు.
నిజానికి పూలబొకేలను ఇవ్వగానే.. పక్కన పడేస్తారు. వాటిని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ... పూలబొకేలో ఇచ్చే ప్రతి పువ్వుకీ ఓ స్పెషాలిటీ ఉంటుందట. మరి మనీషా కోయిరాలా పంపిన పూలు ఏంటి..? దాని స్పెషాలిటీ ఏంటో చూద్దాం....
మనీషా కొయిరాలా ఇచ్చిన ఫ్లవర్ ఏమిటి? : సోనాక్షి , జహీర్ ఇక్బాల్‌లకు మనీషా కొయిరాలా పంపిన పూలు ఆసియాటిక్ లిల్లీస్. లిల్లీ అనే పదం గ్రీకు పదం లిరియన్ నుండి ఉద్భవించింది. ప్రపంచవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ జాతులు కనిపిస్తాయి. ఈ పుష్పం బహుమతిగా ఉత్తమంగా పరిగణిస్తారు.. కొత్తగా పెళ్లయిన నటికి మనీషా కోయిరాలా గులాబీ కలువల అందమైన గుత్తిని పంపింది. ఇది మృదువైన ప్రేమ, స్త్రీత్వం, తీపికి చిహ్నంగా పరిగణిస్తారు. ఇది ఉద్వేగభరితమైన ప్రేమ కంటే ఇద్దరు స్నేహితుల మధ్య బంధాన్ని, స్వచ్ఛమైన ప్రేమను ప్రతిబింబిస్తుంది. ఈ పూలను తల్లిదండ్రులు, పిల్లల మధ్య ప్రేమకు చిహ్నంగా కూడా భావిస్తారు.
ఈ రంగు కలువ అవసరం లేదా? : కలువ పువ్వులు బహుమతిగా ఇవ్వాలి అన్నది నిజం. కానీ లిల్లీస్ అన్ని రంగులు బహుమతిగా సరిపోవు. శుభ కార్యాలలో మీరు ఏ కారణం చేతనూ తెల్ల కలువను ఇవ్వకూడదు. తెలుపు రంగు స్వచ్ఛత , శాంతికి చిహ్నం. కానీ ఇది సాధారణంగా ఈ తెలుపు రంగు కలువలను శుభకార్యాల్లో ఉపయోగించరు. చనిపోయిన ఇంట మాత్రమే వాడతారు. ఈ తెల్లని పువ్వును అంత్యక్రియల సమయంలో , చనిపోయిన వారి శరీరంపై ఉంచడానికి ఉపయోగిస్తారు. మనిషీ కోయిరాలా ఇచ్చినట్లు.. గులాబీ కలువలను మాత్రం.. సంతోషంగా ఎవరికైనా ఇవ్వొచ్చు.
- Manisha Koirala Pink Lilies Bouquet to Sonakshi Sinha
- Sonakshi Sinha Wedding
- bollywood actresses
- bollywood news in kannada
- bollywood wedding
- color of flowers and bouquet
- floral symbolism
- gift flowers
- heeramandi co-stars
- interfaith marriage
- manisha koirala
- monisha koirala wish to sonakshi sinha
- pink lilies
- siginficance of gifts on wedding
- significance of flowers
- sonakshi sinha
- sonakshi sinha jaheer iqbal reception
- sonakshi sinha reception guests
- sonakshi sinha wedding news
- special lilli Flowers
- traditional gestures
- wedding gifts