వెండి పట్టీలు.. జస్ట్ అందానికేనా.. ఆరోగ్యానికి కూడానా?

వెండి, బంగారాన్ని ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ఇక ఆడవాళ్లైతే డబ్బులు ఉంటే చాలు నచ్చిన నగలను కొనేస్తుంటారు. అయితే ప్రతి ఒక్క మహిళ కాళ్లకు ఖచ్చితంగా వెండి పట్టీలను పెట్టుకుంటుంది. చాలా మంది అందానికే వీటిని పెట్టుకుంటారు. కానీ అందానికి కోసమని పెట్టుకునే ఈ వెండి పట్టీలు ఆడవాళ్లకు ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తాయి తెలుసా? 
 

What is the true purpose of silver anklets? rsl

అమ్మాయిలు అందంగా కనిపించే విషయంలో అస్సలు రాజీ పడరు. ముఖ్యంగా చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్క మహిళా ఖచ్చితంగా కాళ్లకు వెండి పట్టీలను పెట్టుకుంటుంది. ఇది అందరికీ తెలిసిందే. కాళ్లకు వెండి పట్టీలు ఎందుకు పెట్టుకుంటారు? అని అడిగితే.. కాళ్లు అందంగా కనిపిస్తాయి లేదా అందరూ పెట్టుకుంటున్నారు కాబట్టి.. అని చాలా మంది చెప్తుంటారు. నిజమే.. కాళ్లకు వెండి పట్టీలు ఆడవాళ్ల అందాన్నే పెంచేస్తాయి. కానీ ఇవి కేవలం అందానికే కాకుండా.. ఆడవాళ్ల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

భారతదేశంలో కాళ్లకు వెండి  పట్టీలు పెట్టుకునే సంప్రదాయం ఇప్పటిది కాదు.. ఎన్నో ఏండ్ల నాటి పురాతనమైన సంప్రదాయం. కానీ ఇప్పుడు వీటిని ప్రతి ఒక్కరూ ఫ్యాషన్, స్టైల్ విషయంలో కాళ్లకు వెండి పట్టీలను పెట్టుకోవడమే మానేశారు. ఇక కొంతమంది ఆడవాళ్లు పెళ్లి తర్వాత ఖచ్చితంగా పెట్టుకుంటుంటారు. నిజానికి ఇదొక సంప్రాదాయం మాత్రమే కాదు.. ఇది మన ఆరోగ్యానికి సంబంధించిన విషయం కూడా. అవును కాళ్లకు వెండి పట్టీలు పెట్టుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటంటే? 

రక్త ప్రసరణ: కాళ్లకు వెండి పట్టీలు పెట్టుకోవడం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఎన్నో వ్యాధులకు మీరు దూరంగా ఉంటారు. అంతేకాకుండా వెండి పట్టీలు పాదాల వాపును తగ్గించడానికి కూడా బాగా సహాయపడతాయి. 

కాలి నొప్పి నుంచి ఉపశమనం:  అవును పాదాలు, కాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగించడానికి వెండి పట్టీలు కూడా సహాయపడతాయి. పాదాల నిర్దిష్ట పీడన బిందువుపై వెండి పట్టీల వల్ల కలిగే ఒత్తిడి నరాలను రిలాక్స్ చేస్తుంది. ఇది నొప్పిని తగ్గించి కాళ్లలో తిమ్మిరి, జలదరింపు, బలహీనత, కాలి అసౌకర్యం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

శరీరాన్ని సమతుల్యం చేయడానికి: వెండి పట్టీలను కాళ్లకు పెట్టుకోవడం వల్ల శరీరంలో విద్యుదయస్కాంత క్షేత్రాలు ఉత్తేజితమవుతాయి. దీని వల్ల శరీరమంతా సమతుల్యత సక్రమంగా ఉంటుంది. అలాగే వెండి పట్టీలను ధరించడం వల్ల శరీర ఉష్ణోగ్రత మెరుగ్గా ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో వెండి పట్టీలను రోజూ పెట్టుకోవడం వల్ల మంచి ప్రయోజనకరంగా ఉంటుంది.  అలాగే వెండి పట్టీల శబ్దం మానసికంగా కూడా రిలాక్స్ అవ్వడంతో పాటుగా నెగెటివ్ ఎనర్జీని తొలగిస్తుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios