తడి తలకు నూనె రాస్తే ఏమౌతుంది..?

తడి తలమీద నూనె రాయడం వల్ల  జుట్టు కుదుళ్లు బలహీనంగా మారతాయి. నూనె, నీళ్లు రెండూ కలిసినప్పుడు.. జుట్టు బలహీనంగా మారుతుంది. దాని వల్ల జుట్టు విపరీతంగా రాలిపోతుంది.

What Happens When You Apply oil on wet hair ram

నార్మల్ గా మనం జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి తలకు నూనె రాస్తూ ఉంటాం.  నూనె రాసుకున్న తర్వాత.. కొన్ని గంటలకు తలస్నానం చేస్తాం. కానీ.. తడి తలమీద నూనె రాస్తారా..?  చాలా మంది తడి తలకు కూడా నూనె రాస్తూ ఉంటారు. అలా రాయోచ్చా.. రాస్తే ఏమౌతుంది..? జుట్టు పాడౌతుందా..? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..

తడి తలమీద నూనె రాయడం వల్ల  జుట్టు కుదుళ్లు బలహీనంగా మారతాయి. నూనె, నీళ్లు రెండూ కలిసినప్పుడు.. జుట్టు బలహీనంగా మారుతుంది. దాని వల్ల జుట్టు విపరీతంగా రాలిపోతుంది.  కాబట్టి.. పొరపాటున కూడా.. తడి తలకు నూనె రాయకూడదు.

అంతేకాదు.. తడి తలకు నూనె రాయడం వల్ల,. లేని సమస్యలు కూడా వస్తాయి. అంటే... ఇప్పటి వరకు మీకు చుండ్రు సమస్య లేకపోయినా.. దీని తర్వాత వచ్చే అవకాశం ఉంది. ఎక్కడైనా కాస్త ఉంటే.. అది కాస్త బాగా పెరిగిపోతుంది.

తడి తలకు నూనె రాసినా, నూనె తలపై నీళ్లు పోసుకున్నా.. రెండింటిలో ఏది జరిగినా... మీ తల నుంచి దుర్వాసన రావడం ఖాయం. అందుకే.. ఈ రెండూ జరగకుండా చూసుకోవాలి. తడి తలకు నూనె రాసినప్పుడు.. జుట్టు కుదుళ్లకు దుమ్ము అంటుకుపోయే అవకాశం ఉ:ది.  దాని వల్ల.. జుట్టును బలహీనంగా మారుస్తుంది.  జుట్టు ఇన్ఫెక్షన్లు కూడా వచ్చే ప్రమాదం ఉంది.

అయితే... తలకు నూనె రాయడం వల్ల  కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. తడి తలపై నూనె రాసినప్పుడు జుట్టు గడ్డిలా మారకుండా.. ఉంటుంది. ఎక్కువ సేపు జుట్టు షైన్ అవుతూ ఉంటుంది. అయితే.. నూనె ఎలా రాయాలో కూడా తెలుసుకోవాలి.

జుట్టును ముందు శుభ్రం చేసుకోవాలి. తర్వాత.. జుట్టు ఆరనివ్వాలి. ఆ తర్వాత.. నూనె రాసి.. తలకు మసాజ్ చేయాలి.  ఇలా చేయడం వల్ల.. జుట్టు కుదుళ్లు బలహీనంగా మారే ఛాన్స్ ఉండదు. కనీసం వారానికి రెండు సార్లు అయినా తలకు నూనె రాస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల  జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios