Asianet News TeluguAsianet News Telugu

జాపత్రి ఆడవాళ్లకు ఓ వరం.. ఏయే లాభాలు ఉన్నాయంటే?

జాపత్రి ఒక మసాలా దినుసు. దీన్ని కేవలం వంటలు చేయడానికి మాత్రలే ఉపయోగిస్తాం. కానీ దీన్ని ఆడవాళ్లు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉపయోగించొచ్చు తెలుసా? అసలు జాపత్రి వల్ల ఆడవాళ్లకు ఎన్ని లాభాలు కలుగుతాయంటే?

what are the benefits of javitri for female rsl
Author
First Published Jul 21, 2024, 4:51 PM IST | Last Updated Jul 21, 2024, 4:51 PM IST


వంటల్లో మనం ఎన్నో రకాల మసాలా దినుసులను ఉపయోగిస్తాం. ఇవి ఫుడ్ మంచి టేస్టీగా చేస్తాయి. ఇళాంటి మసాలా దినుసుల్లో జాపత్రి ఒకటి. ఇది చూడటానికి ఒక పువ్వులా కనిపిస్తుంది. ఈ జాపత్రి ఫుడ్ కు మంచి సువాసన, రుచిని ఇవ్వడమే కాకుండా.. ఆడవారి ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అవును జాపత్రి వల్ల ఆడవారు ఎన్నో సమస్యలకు దూరంగా ఉంటారు. అసలు జాపత్రి ఆడవారికి ఎలా ఉపయోగపడుతుందంటే? 

చర్మానికి మంచిది : జాపత్రి ఆడవాళ్ల చర్మానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. అవును జాపత్రిని ఉపయోగించి ఆడవారు ముఖంపై మచ్చలను,  బ్లాక్ హెడ్స్ ను తొందరగా తగ్గించుకోవచ్చు. 

కీళ్ల నొప్పులు: ఒకప్పుడు 40, 50 ఏండ్ల వారికే కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వచ్చేవి. కానీ ఇప్పుడు 25 ఏండ్ల వారికి కూడా కీళ్ల నొప్పులు వస్తున్నాయి. ఆడవారు ఈ జాపత్రిని ఉపయోగించి కీళ్ల నొప్పుల నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబతున్నారు. మీ ఆహారంలో జాపత్రిని చేర్చుకుంటే కీళ్ల నొప్పులు, వాపు నుంచి ఉపశమనం లభిస్తుంది. 

జాపత్రిని ఎలా తీసుకోవాలి:  2 గ్రాముల జాపత్రిలో కొద్దిగా ఎండు అల్లాన్ని వేసి  కలపండి. దీన్ని వేడి నీళ్లతో తీసుకోండి. ఇలా చేయడం వల్ల ఆడవాళ్లకు కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. 

కడుపు సమస్యల నుంచి ఉపశమనం:  జాపత్రిని మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల అజీర్ణం, అతిసారం,మలబద్ధకం, కడుపు నొప్పి వంటి కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 

ఒత్తిడి నుంచి ఉపశమనం:  ప్రస్తుత కాలంలో చాలా మంది  ఆడవారు ఇంటిని, ఆఫీసును చూసుకోలేక బాగా ఒత్తిడికి గురవుతున్నారు. ఇలా ఒత్తిడికి గురయ్యే ఆడవారికి జాపత్రి ఎంతో మేలు చేస్తుంది. ఈ మసాలానుు తీసుకుంటే ఒత్తిడి తగ్గుతుంది. అలాగే ప్రశాంతంగా ఉంటారు. 

బలహీనత: మీకు ఆకలి తక్కువగా అయితే.. జాపత్రిని ఖచ్చితంగా తినండి. అలాగే బలహీనంగా అనిపించినా కూడా మీరు ఆహారంలో జాపత్రిని చేర్చుకోవచ్చు. ఎందుకంటే ఇది మీ ఆకలిని పెంచడానికి బాగా సహాయపడుతుంది.

కిడ్నీలో రాళ్లు: జాపత్రిలో ఎన్నో ఔషదగుణాలు ఉంటాయి. ఇవి మూత్రపిండాల్లో రాళ్లు రాకుండా కాపాడతాయి. ఒకవేళ కిడ్నీల్లో రాళ్లు ఉంటే కూడా వాటిని కరిగించడానికి , బయటకు పంపడానికి సహాయపడతాయి. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios