టీ, కాఫీలు తాగితే అక్కడ ఆ సమస్యలు వస్తాయి.. జాగ్రత్త

టీ, కాఫీలను ఎక్కువగా తాగితే బాడీ డీహైడ్రేషన్ బారిన పడుతుంది. అంతేకాదు యోని నుంచి చెడు వాసన, సంక్రమణ ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 
 

Vaginal Health: how drinking too much chai or coffee can affect your vaginal health

మన శరీరంలోని ఇతర అవయవాల మాదిరిగానే యోని ఆరోగ్యాన్ని పట్టించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దీని పట్ల ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా యోని ఇన్ఫెక్షన్లు వస్తాయి. అందుకే చిన్న వయస్సులోనే మహిళలకు యోని పరిశుభ్రతను పాటించాలి. పీరియడ్స్ నుంచి సెక్స్ వరకు ప్రతి విషయంలోనూ మహిళలు పరిశుభ్రతను మెయింటన్ చేయాలి. అయితే కొన్ని పానీయాలు కూడా యోని ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని నిపుణులు చెబుతున్నారు. 

ఎక్కువ మొత్తంలో పానీయాలు తాగడం వల్ల శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. అందులోనూ తీపి పానీయాలను ఎక్కువగా తాగితే మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కాఫీని ఎక్కువగా తాగడం, కషాయంలో స్టెరాయిడ్లను కలిపి తాగడం వల్ల మీ యోని ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు 

కాఫీ సంక్రమణకు కారణమవుతుంది..

చాలా మంది కాఫీ ప్రియులు రోజుకు నాలుగైదు కప్పుల  కాఫీలను లాగిస్తారు. కానీ ఇది శరీరంలో నీటి పరిమాణాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు కాఫీని ఎక్కువగా తాగడం వల్ల యోని నుంచి ఘాటు వాసన రావడం ప్రారంభమవుతుంది. నిజానికి పదేపదే కాఫీ తాగడం వల్ల ఈస్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఒకటి కంటే ఎక్కువ సార్లు కాఫీ తాగడం వల్ల శరీరంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. దీనిలో ఉండే కెఫిన్ కంటెంట్ విటమిన్లు, ఖనిజాలను నాశనం చేస్తుంది. 

ఆల్కహాల్ నిర్జలీకరణాన్ని పెంచుతుంది

మత్తు శరీరానికి హాని కలిగిస్తుంది. రోజూ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా యోని ఆరోగ్యం దెబ్బతింటుంది. నిజానికి రోజూ వైన్ తాగడం వల్ల శరీరంలో వాటర్ కంటెంట్ తగ్గుతుంది. ఇది క్రమంగా జననేంద్రియ ప్రాంతంలో సహజ కందెనలను తగ్గిస్తుంది. దీనివల్ల యోనిలో నొప్పి, యోని పొడిబారడం వంటి సమస్యలను పుట్టిస్తుంది. 

టీ డయేరియా ప్రమాదాన్ని పెంచుతుంది

టీ లో కూడా కెఫిన్ కంటెంట్ ఉంటుంది. దీన్ని కూడా ఎక్కువగా తాగకూడదు. నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ప్రకారం.. ఒక కప్పు టీలో సాధారణంగా తక్కువ కెఫిన్ ఉంటుంది. కానీ ఎక్కువగా సార్లు టీని తాగితే శరీరంలో కెఫిన్ స్థాయి పెరుగుతుంది. రోజుకు ఎక్కువ సార్లు టీని తాగితే మీరు డయేరియా బారిన పడతారు. ఫలితంగా యోని పొడిబారుతుంది. కెఫిన్ పురుషుల కంటే మహిళలకే ఎక్కువ హాని చేస్తుంది. దీనివల్ల మహిళల్లో హార్మోన్ల స్థాయి క్షీణిస్తుంది. క్రమంగా వీళ్ల శరీరంలో టెస్టోస్టెరాన్ పరిమాణం తగ్గడం మొదలవుతుంది.

యోని ఆరోగ్యాన్ని కాపాడే చిట్కాలు

  • మూత్ర విసర్జన తర్వాత ప్రైవేట్ భాగాలను శుభ్రం చేయండి.
  • నిపుణుల ప్రకారం.. అసురక్షిత సెక్స్ యోని ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఎన్ననో రకాల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. 
  • యోని చుట్టూ చెమట పేరుకుపోనివ్వకూడదు. ఎందుకంటే ఇది ఇన్ఫెక్షన్ కు దారితీస్తుంది. 
  • పుష్కలంగా నీటిని తాగాలి. 
  • బిగుతైన లోదుస్తులు ధరించడం మానుకోవాలి. ఎప్పుడూ కూడా కాటన్ లోదుస్తులనే ధరించాలి.
Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios