పీరియడ్స్ టైం ఇలా అస్సలు చేయకండి.. లేదంటే ఎన్నో సమస్యలొస్తయ్..

పీరియడ్స్ ఒక సహజ ప్రక్రియ. కానీ దీనివల్ల ఆడవాళ్లకు శారీరక, మానసిక సమస్యలు వస్తాయి. ముఖ్యంగా కొన్ని తప్పులు చేస్తే కడుపు నొప్పి, తిమ్మిరి ఎక్కువవుతాయని నిపుణులు చెబుతున్నారు. 
 

these mistakes can makes your periods more painful avoid them

పీరియడ్స్ సమయంలో ఎన్నో శారీరక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కొంతమంది మహిళలకు కడుపు ఉబ్బరం సమస్యలు కూడా వస్తాయి. కానీ చాలా మందికి విపరీతమైన కడుపు నొప్పి, తిమ్మిరి వంటి సమస్యలు వస్తాయి. కొందరికీ ఎలాంటి సమస్యలు రాకపోవచ్చు. ఏదేమైనా పీరియడ్స్ సమస్యలు భిన్నంగా ఉంటాయి. అయితే పీరియడ్స్ సమయంలో కొన్ని తప్పులు చేస్తేనే ఈ సమస్యలు ఎక్కువ ఇబ్బంది పెడతాయంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఆరోగ్య నిపుణుల ప్రకారం..  బాధాకరమైన పీరియడ్స్ ను డిస్మెనోరియా అంటారు. డోమెట్రియోసిస్, ఫైబ్రాయిడ్ గర్భాశయం, కటి ఇన్ఫెక్షన్ అంటే పీఐడీ, ఎస్టిఐ బాధాకరమైన పీరియడ్స్ కు కారణమవుతాయి. చాలా మంది కౌమార బాలికలు ఎక్కువ పీరియడ్స్ నొప్పితో బాధపడుతుంటారు. నెలసరి సమయంలో ఐదు రోజులు నొప్పి ఉంటే తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

 తరచుగా టీ లేదా కాఫీ తాగడం

పీరియడ్స్ లో తిమ్మిరి రాకుండా ఉండేందుకు పదేపదే టీ, కాఫీలు తాగుతుంటారు చాలా మంది. కానీ ఇది అస్సలు మంచిది కాదు. ఎందుకంటే దీనికివల్ల ఒత్తిడి, రక్తపోటు, హార్ట్ బీట్ పెరుగుతుంది. ఇది మీకు రోజంతా అలసటను కలిగిస్తుంది. అందుకే టీ కాఫీ లకు బదులుగా సేంద్రీయ టీ లేదా ఆరోగ్యకరమైన రసాలు, షేక్ లను తాగండి. కొన్నిసార్లు కెఫిన్ దిగువ పొత్తికడుపులో తిమ్మిరిని కలిగిస్తుంది. కెఫిన్ నిర్జలీకరణానికి దారితీస్తుంది. 

ఉపవాసం

రక్తస్రావం ఎక్కువగా అయితే శరీరం బలహీనంగా మారుతుంది. అందుకే ఈ పీరియడ్స్ సమయంలో ఉపవాసం ఉండకూడదు. ఎందుకంటే ఉపవాసం వల్ల మీ శరీరం మరింత బలహీనంగా మారుతుంది. అందుకే మీరు ఈ సమయంలో పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తినాలి. దీంతో శరీరానికి విటమిన్లు, మినరల్స్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా అందుతాయి. ఈ సమయంలో ఉపవాసం ఉంటే లేని పోని సమస్యలు వస్తాయి. 

వ్యాక్సింగ్ చేయడం

పీరియడ్స్ సమయంలో నొప్పి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చర్మం కూడా మరింత సున్నితంగా మారుతుంది. ఇలాంటి సమయంలో వ్యాక్సింగ్ చేయించుకోవడం మంచిది కాదు. వ్యాక్సింగ్ సమయంలో చర్మం సాగదీయడం వల్ల నొప్పి ఎక్కువవుతుంది. అలాగే షేవింగ్ వల్ల చర్మం కోసుకుపోయే ప్రమాదం ఉంది. ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే ఆ సమయంలో వ్యాక్సింగ్ కు దూరంగా ఉండాలి.

ఒకే ప్యాడ్ ను ఎక్కువసేపు ఉపయోగించడం

చాలా మంది మహిళలు రోజంతా ఒకే ప్యాడ్ ను ఉపయోగిస్తుంటారు. ఇది టాక్సిక్ షాక్ సిండ్రోమ్ ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే యోనిలో దురద పెడుతుంది. బ్యాక్టీరియా కూడా పెరుగుతుంది. ఈ సమస్యను నివారించడానికి ప్యాడ్ ను రోజుకు మూడుసార్లు మార్చండి. సుమారు 6 గంటల్లో ప్యాడ్ మార్చడం మంచిది. దీంతో మరకలు, చెడు వాసన, అసౌకర్యం వంటి సమస్యలు ఉండవు. 

పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవడం

ఈ సమయంలో పాలను ఎక్కువగా తాగితే  శరీరంలో నీరు అలాగే నిల్వ ఉంటుంది. దీనికి తోడు పాలు అసిడిటీ సమస్యకు దారితీస్తుంది. పీరియడ్స్ సమయంలో తక్కువ కొవ్వు ఉన్న పాలు తీసుకోవడం వల్ల తిమ్మిర్లు వచ్చే ప్రమాదం ఉండదు. అయితే పాలను ఎక్కువగా తాగితే మలబద్దకం సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

అసురక్షిత సెక్స్

పీరియడ్స్ సమయంలో సెక్స్ లో పాల్గొంటే శరీరంలోని ఉద్వేగం నుంచి ఉపశమనం లభిస్తుంది. రుతుక్రమం సమయంలో శృంగారంలో పాల్గొనడం వల్ల కూడా కొన్నిసార్లు ఇబ్బందులు పెరుగుతాయి. వాస్తవానికి రక్తస్రావం సమయంలో సన్నిహితంగా ఉండటం వల్ల ఎస్టీఐల ప్రమాదం పెరుగుతుంది. అంటే లైంగిక సంక్రమణ వ్యాధి. నిజానికి ఈ ఇన్ఫెక్షన్లు రక్తంలో కనిపిస్తాయి. కండోమ్ లు లేకుండా సెక్స్ లో పాల్గొనడం వల్ల ఇబ్బంది కలుగుతుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios