మీరా రాజ్ పూత్ అందమైన కురుల వెనక రహస్యం ఇదే...!
ఆమె తన జట్టును ఆరోగ్యంగా ఉంచుకునేందుకు స్వయంగా తయారుచేసుకున్న నూనెను ఉపయోగిస్తారు. ఆమె తన అందాన్ని పెంచుకోవడం కోసం ఎక్కువగా ఆయుర్వేదాన్ని ఉపయోగిస్తూ ఉంటారట.
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్ పూత్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోయినట్లను తలదన్నే అందంతో ఆమె ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉన్నారు. ఇద్దరు పిల్లలు తల్లిగా మారినా... ఆమె లో అందం ఏ మాత్రం తగ్గలేదనే చెప్పాలి. ఆమె షాహిద్ తో కలిసి పలు టీవీ యాడ్స్ కూడా ఇచ్చారు.
ఆమె జుట్టు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఆమె తన జట్టును ఆరోగ్యంగా ఉంచుకునేందుకు స్వయంగా తయారుచేసుకున్న నూనెను ఉపయోగిస్తారు. ఆమె తన అందాన్ని పెంచుకోవడం కోసం ఎక్కువగా ఆయుర్వేదాన్ని ఉపయోగిస్తూ ఉంటారట.
దానికోసం ఆమె నూనెను ఎలా తయారుచేసుకుంటారో చూద్దాం... ఆ నూనె తయారు చేయడానికి కావాల్సినవి.. మందార పూలు, కొబ్బరి నూనె, మెంతులు, ఉసిరికాయ లేదంటే ఉసిరి పొడి, వేప, మునగ ఆకులు.
నూనె తయారుచేసే విధానం..
ముందుగా రెండు మందారపూలు, ఎడెనిమిది మందార ఆకులు, కొద్దిగా కొబ్బరి నూనె తీసుకొని... వీటన్నింటినీ కలిపి మెత్తని పేస్టులాగా చేసుకోవాలి. మందార.. జుట్టు బలంగా పెరగడానికి సహాయపడుతుంది.
ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొబ్బరి నూనె పోసి బాగా వేడిచేయాలి. అందులో ఈ మందార పేస్టు వేసి బాగా మరగనివ్వాలి. కొబ్బరి నూనెలో ఉండే లారిక్ యాసిడ్.. జుట్టుకు కెరాటిన్ ని అందిస్తుంది. దీని వల్ల జుట్టురాలే సమస్య తగ్గుతుంది.
ఇప్పుడు దాంట్లోనే మెంతులు వేయాలి. మెంతుల్లో ఉండే ఫ్లేవనాయిడ్స్... జుట్టు పెరగడానికి సహాయపడతాయి. ఇప్పుడు దీంట్లోనే ఉసిరి పొడి, కరివేపాకు ఆకులు వేసి మరగనివ్వాలి. ఇవి రెండూ తెల్ల జుట్టు రాకుండా ఉండేందుకు సహాయపడతాయి.
ఆ తర్వాత దీనిలో... వేప, మునగ ఆకులను కూడా వేయాలి. ఈ రెండు మన జుట్టులో ఎలాంటి బ్యాక్టీరియా తయారవ్వకుండా సహాయం చేస్తాయి. జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. మునగా ఆకులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.
అన్నీ వేసి బాగా మరిగించిన తర్వాత.. ఈ నూనెను వడపోయాలి. గోరువెచ్చగా ఉన్న సమయంలో.. జుట్టుకు రాసుకోవాలి. ఇది జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మీరా రాజ్ పూత్ ఈ నూనెను ఉపయోగిస్తారు. మీరు కూడా ప్రయత్నించవచ్చు. ఈ నూనె రాత్రిపూటరాసుకొని.. ఉదయాన్నే తలస్నానం చేస్తే సరిపోతుంది.