కొత్త వ్యాయామాలపై సమంత కసరత్తు.. వీడియో చూశారా..?
ఆమె మయోసిటీస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు ఆమె చెప్పారు. దాని నుంచి బయటపడటానికి ఆమె పోరాటం చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే దాని నుంచి ఆమె కోలుకుంటున్నారు.

తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో సమంత ఒకరు. ప్రస్తుతం ఆమె హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలపై దృష్టి పెట్టారు. ఇటీవల యశోద సినిమాతో హిట్ కొట్టిన సామ్... శాకుంతలంతో మన ముందుకు రావడానికి రెడీ అయ్యారు. త్వరలోనే ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరో వైపు సమంత విజయ్ దేవరకొండతో కలిసి ఖుషీ సినిమాలోనూ నటిస్తోంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే సమంత అనారోగ్యానికి గురైంది. ఆమె మయోసిటీస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు ఆమె చెప్పారు. దాని నుంచి బయటపడటానికి ఆమె పోరాటం చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే దాని నుంచి ఆమె కోలుకుంటున్నారు. కాగా... తాను మళ్లీ బ్యాక్ టూ ఫామ్ లోకి రావడానికి సామ్.... వర్కౌట్స్ పై దృష్టి పెట్టారు.
తాజాగా.. తన కొత్త వర్కౌట్ వీడియోని సమంత షేర్ చేశారు. 2023లో మరింత స్ట్రాంగ్ గా అయ్యేందుకు కొత్త వర్కౌట్ చేస్తున్నట్లు ఆమె చెప్పారు.దానిలో భాగంగా సింగిల్ లెగ్ తో రోల్ బ్యాక్ చేశారు. ఇది చూడటానికి సింపుల్ గా అనిపిస్తున్నా.. చేయడం అంత సులువేమీ కాదు అంటూ ఆమె ఈ వీడియోని షేర్ చేశారు. మరి కొద్దిరోజుల్లోనే సమంత... మళ్లీ ఫుల్ ఎనర్జీతో ఆరోగ్యంగా వెనక్కి వస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.
ఈ రోల్ బ్యాక్ వర్కౌట్ చేయడం వల్ల వెన్నుముక బలపడటంతో పాటు.. మజిల్స్ గట్టిపడతాయట. ఈ వర్కౌట్ తో గాయాల బారి నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందట. మజిల్స్ బలపడటానికి కూడా ఉపయోగపడుతుందట.