జాన్వీ కపూర్ హెల్దీ వర్కౌట్ మీల్..!
జాన్వీ... ఫిట్నెస్ విషయంలో చాలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారు. వర్కౌట్ తర్వాత ఆమె ఎలాంటి ఫుడ్ తీసుకుంటారో... ఆ హెల్దీ ప్రోటీన్ ఏంటో ఓసారి చూద్దాం..
బాలీవుడ్ అందాల తార జాన్వీకపూర్ గురించి తెలియనివారు ఉండరు. ఆమె అందానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే. అతిలోక సుందరి తల్లి అందం మొత్తం పునికిపుచ్చుకుంది. త్వరలోనే టాలీవుడ్ లోనూ అడుగుపెడుతోంది. జాన్వీ తెలుగులో ఎన్టీఆర్ సరసన నటించనున్నారు. ఇప్పటికే ఆమె ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు.
ఈ సంగతి పక్కన పెడితే...జాన్వీ... ఫిట్నెస్ విషయంలో చాలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారు. వర్కౌట్ తర్వాత ఆమె ఎలాంటి ఫుడ్ తీసుకుంటారో... ఆ హెల్దీ ప్రోటీన్ ఏంటో ఓసారి చూద్దాం..
జాన్వీ తన వర్కౌట్ మీల్ గా రాగి స్వీట్ పొటాటో పరాటా తీసుకుంటారు. దానిని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. దానిని ఎలా తయారు చేయాలో మనం ఓసారి చూద్దాం...
ఈ రాగి స్వీట్ పొటాటో తయారీకి కావాల్సిన పదార్థాలేంటో ఓసారి చూద్దాం..
1.అరకప్పు రాగి పిండి, ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, ఒక టేబుల్ స్పూన్ గోధుమ పిండి, 4-6టేబుల్ స్పూన్ నూనె, రెండు ఉకడపెట్టిన స్వీట్ పొటాటో, 20ఎంఎల్ వాటర్, ఒక టీస్పూన్ కొత్తమీర ఆకులు, ఒక పచ్చిమిరపకాయ, రుచికి తగినంత ఉప్పు, పావు స్పూన్ జీలకర్ర పొడి, అరస్పూన్ దనియాల పొడి, అర స్పూన్ నిమ్మరసం.
తయారీ విధానం..
ముందుగా ఉడకపెట్టిన స్వీట్ పొటాటోలను మెత్తగా స్మాష్ చేయాలి. ఆ తర్వాత దానిలో ఉప్పు, దనియాల పొడి, పచ్చి మిరపకాయలు, జీలకర్ర పొడి, నిమ్మరసం, కొత్తమీర వేసి బాగా కలపాలి
ఇప్పుడు రాగిపిండి, గోధుమ పిండి, ఆలివ్ ఆయిల్ వేసి, సరిపడ నీరు పోసి ... పిండి బాగా కలపాలి. ఇప్పుడు ఆ పిండిని చిన్నచిన్న ఉండల్లాగా చేసుకోవాలి.
ఇప్పుడు ఒక్కొక పిండి ముద్ద తీసుకొని... అందులో ముందుగా స్మాష్ చేసి ఉంచుకున్న స్వీట్ పొటాటో ఒక్కో స్పూన్ ఉంచి.. పరాటాలా గా ఒత్తుకోవాలి. ఆతర్వాత.... తవా పెట్టి... ఆ పరాటాలను కాల్చుకోవాలి. అంతే... హెల్దీ రాగి స్వీట్ పొటాటో పరాటా రెడీ.
ఇవి ఆకలి తీర్చడమే కాదు... ఆరోగ్యాన్ని అందిస్తాయి. వర్కౌట్ తర్వాత... వీటినిన తీసుకుంటే చాలా ఎనర్జీని ఇస్తుంది. జాన్వీ తన వర్కౌట్ తర్వాత వీటినే తీసుకుంటుందట. ఇంకెందుకు మీరు కూడా మీ డైట్ లో భాగం చేసుకోండి.