టమాటాలు ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉండాలంటే ఏం చేయాలి?
వానాకాలంలో టమాటాలు చాలా తొందరగా పాడవుతుంటాయి. ఫ్రిజ్ లో పెట్టినా ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. కానీ మీరు కొన్ని సింపుల్ టిప్స్ ను ఫాలో అయితే మాత్రం టమాటాలు ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంటాయి. అదెలాగంటే?
వర్షాకాలంలో కూరగాయల రేట్లు ఆకాశాన్నంటుతుంటాయి. అందులోనూ ఈ సీజన్ లో కూరగాయలు తొందరగా పాడవుతాయి. కుళ్లిపోతుంటాయి. ముఖ్యంగా వానాకాలంలో టమాటాల ధర విపరీతంగా పెరిగిపోతుంది. అంతేనా.. ఈ కూరగాయ కుళ్లిపోయినంత తొందరగా ఏదీ కుళ్లిపోదు. కానీ టమాటా లేని కూర చేయడం సాధ్యం కాదు. చట్నీ, సలాడ్, పప్పులు, సాంబర్ అంటూ ప్రతి కూరలో టమాటాలను ఖచ్చితంగా వేస్తుంటాం. అందుకే టమాటాలు తొందరగా కుళ్లిపోకూడదంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
పసుపు వాటర్
పసుపు వాటర్ తో టమాటాలను ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంచొచ్చు. ఇందుకోసం అర టీస్పూన్ ఉప్పును, పసుపును నీటిలో వేయండి. ఈ నీళ్లలో టమాటాలను కాసేపు ఉంచండి. తర్వాత పసుపు నీళ్ల వీటిని తీసి శుభ్రమైన నీటితో కడిగి, బాగా తుడిచి ఆరబెట్టండి. ఆ తర్వాత ఒక కాగితం పరిచిన పాత్రలో టమాటాలను పోయండి. అయితే టమాటా కాండం కిందికి ఉండేలా చూసుకోండి. ఇలా టమాటాలను నిల్వ చేస్తే వారాలా పాటు ఫ్రెష్ గా ఉంటాయి.
శుభ్రంగా కడుక్కోవాలి
మార్కెట్ నుంచి తెచ్చిన టమాటాలను అప్పుడే కడిగే అలవాటు ఏ ఒక్కరికీ ఉండదు. కానీ వీటిని మీరు ఫ్రిజ్ లో పెట్టేకంటే ముందే బాగా కడిగి ఆరబెట్టాలి. టమాటాలకు నీళ్లు అంటుకోకూడదు. ఆ తర్వాత టమాటాలను ఒక బుట్టలో వేయండి. టమాటాలను ఫ్రిజ్ లో నిల్వ చేసేటప్పుడు వాటిని సపరేట్ పాత్రలోనే ఉంచాలి.అలాగే ఒకదానిపై ఒకటి వేయకూడదు. దీంతో టమాటాలు ఒకదానిపై మరొకటి లోడ్ కాకుండా ఉంటాయి. టమాటాలపై బరువు పడితే అవి తొందరగా కుళ్లిపోతాయి.
నేలపై
టమాటాలను మీరు మట్టిలో కూడా నిల్వ చేయొచ్చు. ఇందుకోసం ఒక బుట్టలో మట్టిని నింపి అందులో టమాటాలను పెట్టండి. దీనివల్ల టమాటాలు చాలా రోజుల వరకు పాడవకుండా ఉంటాయి. కానీ ఇలా చేసేటప్పుడు మట్టిలో లేదా టమాటాలకు నీరు ఉండకూడదు. మట్టిలోనుంచి టమాటాలను తీసేటప్పుడు లేదా పెట్టేటప్పుడు కూడా మీ చేతులు డ్రైగా ఉండాలి.
వార్తాపత్రిక
మీరు టమాటాలను ఫ్రిజ్ లోపల పెట్టాలనుకుంటే ఒక పెద్ద బుట్టలో టమాటాలను వరుసగా, ఒకదానిపై ఒకటి లేకుండా పెట్టండి. దానిపై వార్తాపత్రికను కప్పండి. ఆ తర్వాత టమాటాలను రెండో లేయర్ పెట్టండి. దీనివల్ల కూడా టమాటాలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.
- adopt these methods
- easy ways to store tomatoes
- hacks to store tomatoes
- how to store tomatoes
- keep in mind while storing expensive tomatoes
- kitchen tips
- store tomatoes for long time
- tips to store tomatoes
- ways to store tomatoes
- ways to store tomatoes for longer time
- ways to store tomatoes for longer time in monsoon